- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyundai Motor: కమర్షియల్ కార్ల తయారీలోకి హ్యూండాయ్ మోటార్ ఇండియా
ఈ కొత్త ప్రైమ్ మోడల్స్ క్యాబ్ సేవలతో పాటు డెలివరీ సేవల కోసం అభివృద్ధి చేసినట్టు కంపెనీ వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్స్ కొత్త విభాగంలోకి అడుగుపెట్టింది. కంపెనీ కమర్షియల్ వాహన విభాగంలోకి అడుగుపెడుతూ, ప్రైమ్ హెచ్‌బీ(హ్యాచ్‌బ్యాక్), ప్రైమ్ ఎస్‌డీ(సెడాన్) కొత్త కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ప్రైమ్ మోడల్స్ క్యాబ్ సేవలతో పాటు డెలివరీ సేవల కోసం అభివృద్ధి చేసినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ కార్లు తక్కువ నిర్వహణ, మెరుగైన పనితీరు, ఎక్కువ సంపాదించుకునే లక్ష్యంతో రూపొందించారు. ఈ రెండు మోడళ్లు 1.2 లీటర్ కప్పా 4-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేయనుండగా, పెట్రోల్, సీఎన్‌జీ రెండు ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి. ధరలకు సంబంధించి ప్రైమ్ హెచ్‌బీ ధర రూ. 5.99 లక్షల నుంచి, ప్రైమ్ ఎస్‌డీ రూ. 6.89 లక్షల నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని హ్యూండాయ్ డీలర్‌షిప్‌లలో రూ. 5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. కమర్షియల్ అవసరాలకు వాడుకోవాలని భావించే కస్టమర్లకు తక్కువ నిర్వహణ ఖర్చుతో, ఎక్కువ పనితీరుతో ఈ కార్లు ప్రయోజనాలను అందిస్తాయని హ్యూండాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ తరుణ్ గార్గ్ తెలిపారు. రెండు మోడళ్లూ ఎక్స్‌డెంటెడ్ వారెంటీతో వస్తాయని, 4-5 ఏళ్లు లేదా 1,80,000 కిలోమీటర్ల వరకు కవరేజీ లభిస్తాయి. కిలోమీటర్‌కు 47 పైసలు మాత్రమే ఖర్చు అవుతుందని, 72 నెలల వరకు నెలావారీ చెల్లింపుల కాలపరిమితితో కూడిన ఫ్లెక్సిబుల్ ఫైనాన్స్ సదుపాయం కూడా ఉందని కంపెనీ పేర్కొంది.






