- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
నేడు బంగారం ధరలు పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,36,150 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.2,400 పెరిగి రూ. 1,38,550గా ఉంది.

దిశ,వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరో రోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు కాస్త ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు పెరిగాయి.
ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,36,150 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.2,400 పెరిగి రూ. 1,38,550గా ఉంది. అలాగే నిన్న రూ.1,24,800 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.2,200 పెరిగి రూ.1,27,000 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.3000 పెరిగి కిలో రూ. 2,34,000 గా ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే?
22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,27,000
24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,38,550
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే?
22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,27,000
24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,38,550






