Akshaya Tritiya: అక్షయతృతీయ సందర్భంగా కేవలం 100 రూపాయలకే బంగారం కొనుగోలు చేయడం ఎలా..?

by Vennela |

Akshaya Tritiya: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా?

Akshaya Tritiya: అక్షయతృతీయ సందర్భంగా కేవలం 100 రూపాయలకే బంగారం కొనుగోలు చేయడం ఎలా..?
X

దిశ, వెబ్ డెస్క్: Akshaya Tritiya: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ప్రస్తుతం పెరిగిపోయిన బంగారం ధరల నేపథ్యంలో ఒక గ్రాము బంగారం కొనుగోలు చేయాలన్న దాదాపు పదివేల రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయాలని చాలామంది సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్లేనని చాలామంది భావిస్తారు.

ఈ సెంటిమెంట్కు అనుగుణంగా ఎలా అయినా చేసి ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. కానీ పెరిగిపోయిన ధరలను చూస్తుంటే మాత్రం ఆందోళన కలిగిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత సంవత్సరం అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ధర 70 వేల రూపాయలకు ఒక తులం చొప్పున లభించింది.

అదే ఈ సంవత్సరం లక్ష రూపాయల సమీపానికి చేరుకుంది. అంటే 30 వేల రూపాయల వరకు పెరిగింది అని అర్థం. ఈ నేపథ్యంలో మీరు బంగారు ఆభరణాలను అతి తక్కువ ధరకే కేవలం 100 రూపాయలకే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా అయితే ఈ వార్త మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలా వరకు ఫోన్ పే, పేటియం, గూగుల్ పే వంటి యాప్స్ డిజిటల్ గోల్డ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని డిజిటల్ గోల్డ్ సేవింగ్స్ స్కీం సేవలు అందిస్తున్నాయి.

ఇందులో మీరు కేవలం ఒక రూపాయి నుంచి బంగారం కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ఒకవేళ మీరు ప్రతి నెల లేదా మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడల్లా ఈ గోల్డ్ సేవింగ్స్ స్కీం లో డబ్బులు పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేశారు అంతకు తగిన బంగారం హోం డెలివరీ కూడా పొందే అవకాశం ఉంటుంది. లేదా మీరు డిజిటల్ రూపంలోనే దానిని మార్కెట్ ధరకు విక్రయించి డబ్బు పొందే అవకాశం ఉంటుంది. డిజిటల్ బంగారం సేఫ్ అండ్ సెక్యూర్ లక్షణాలు కలిగి ఉంటుంది కనుక దీనిని ఒకరు దొంగలిస్తారనే బాధ ఉండదు.

Next Story