- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aviation: భారత విమానాలపై గగనతల నిషేధంతో పాక్‌కే ఎక్కువ నష్టం
ప్రతి ఏటా కొన్ని వందల కోట్లు ఉంటుందని, మానవజాతి చరిత్రలో ఎన్నడూ ఒక దేశం ఇలాంటి మూర్ఖత్వం నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: పెహల్‌గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలకు బదులిచ్చే క్రమంలో దాయాది పాకిస్తాన్ కొత్త కష్టాలు తెచ్చుకుంటోంది. ఇటీవల మనదేశంలో వేగంగా పెరుగుతున్న విమానయాన రంగాన్ని దెబ్బతీయాలని భావించిన పాకిస్తాన్ అందుకనుగుణంగా పాక్‌పై నుంచి మన విమానాలు వెళ్లకుండా నిషేధించింది. అయితే, ఈ నిర్ణయం వల్ల భారత్‌కు కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ, పాక్‌కు మాత్రం అంతకుమించి కోట్లాది రూపాయం ఆదాయాన్ని పాక్ కోల్పోవచ్చని తెలుస్తోంది. భారతీయ విమానాలు పాక్ మీదుగా వెళ్లకపోవడం వల్ల ఒక దేశం గగనతలంపై నుంచి విమానాలు వెళ్లేందుకు చెల్లించే ఓవర్‌ఫ్లైట్ ఫీజు ఆదాయాన్ని దాయాది పోగొట్టుకోనుంది. తాజాగా ఓ పాక్ సోషల్ మీడియా యూజర్ ఎక్స్‌లో.. పాక్ మీదుగా వెళ్లే భారత విమానాన్ని ఉద్దేశించి,ఇంకా దూరం వెళ్లమనే అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు. అయితే, దీనికి స్పందించిన మరో యూజర్ పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎదుర్కొనే ఆర్థిక ప్రభావం గురించి వివరించారు. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న, మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా ఉన్న భారత్ నుంచి పాకిస్తాన్ ఓవర్‌ఫ్లైట్ ఫీజును కోల్పోతుంది. దాని ఫలితం ప్రతి ఏటా కొన్ని వందల కోట్లు ఉంటుందని, మానవజాతి చరిత్రలో ఎన్నడూ ఒక దేశం ఇలాంటి మూర్ఖత్వం నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
సాధారణంగా భారత్ నుంచి భారీ సంఖ్యలో విమానాలు ఇతర దేశాలకు వెళ్తాయి. ముఖ్యంగా పశ్చిమంవైపు యూరప్, ఉత్తర అమెరికాకు వెళ్లడానికి భారత్‌కు పాక్ గగనతలం తక్కువ ఖర్చుతో ఉన్న మార్గం. ప్రధాన ఎయిర్‌లైన్ సంస్థలు ఎయిర్ఇండియా, ఇండిగో ఈ మార్గంలో ఫ్లైట్‌లను నిర్వహిస్తున్నాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్న పాక్ కొన్ని భారతీయ విమానయాన సంస్థల నుంచి ఎంతోకొంత సంపాదిస్తున్నాయి. కాబట్టి, పాకిస్తాన్ తన ఓవర్‌ఫ్లైట్ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కోల్పోతుంది. మళ్లింపుల కారణంగా భారతీయ విమానయాన సంస్థలు అధిక ఇంధన ఖర్చు, ఎక్కువ సమయం ట్రావెల్‌కు సిద్ధమవుతున్నప్పటికీ, పాకిస్తాన్ తన విమానయాన ఆదాయంపై ప్రత్యక్షంగా నష్టపోనుంది.
ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి కాదు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసినప్పుడు దాదాపు 100 మిలియన్ డాలర్లు నష్టపోయిందని 2019 జూలైలో హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది. ఆ సమయంలో ప్రతిరోజూ దాదాపు 400 విమానాలు ప్రభావితమయ్యాయి. దీనివల్ల పాకిస్తాన్ పౌర విమానయాన అథారిటీ (సీఏఏ), పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)లకు భారీ నష్టాలు తప్పలేదు. పాకిస్తాన్ మీదుగా ప్రయాణించే బోయింగ్ 737 విమానానికి ఓవర్‌ఫ్లైట్ ఫీజుగా సుమారు 580 డాలర్(దాదాపు రూ. 50 వేలు) చెల్లించాల్సి ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పెద్ద విమానాలకు, రుసుములు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో ఓవర్‌ఫ్లైట్ ఛార్జీల వల్ల మాత్రమే పాకిస్తాన్ ప్రతిరోజూ సుమారు రూ. 2 కోట్లు నష్టపోతుందని అధికారులు అంచనా వేశారు. ల్యాండింగ్, పార్కింగ్ వంటి ఇతర ఛార్జీలు కలుపుకుంటే, రోజువారీ నష్టం సుమారు రూ. 2.5 కోట్ల వరకు ఉంటుంది. ఇదే సమయంలో అంతర్జాతీయ రూట్‌ల దారి మళ్లింపు కోసం పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ప్రతిరోజూ మరో రూ. 3.92 కోట్లు నష్టపోనుంది. మొత్తంగా, సీఏ, పీఐఏ రోజువారీ నష్టం దాదాపు రూ. 6.50 కోట్లకు చేరుకుంటుంది.






