Sensex crash: సెన్సెక్స్‌ క్రాష్‌.. 8 రోజుల్లో ఎన్ని లక్షల కోట్లు నష్టమో తెలుసా?

by Vennela |

Stock market crash: దేశీయ సూచీలు వరుసగా ఎనిమిదవ రోజూ నష్టాలను వీడలేదు.

Sensex crash: సెన్సెక్స్‌ క్రాష్‌.. 8 రోజుల్లో ఎన్ని లక్షల కోట్లు నష్టమో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: Stock market crash: దేశీయ సూచీలు వరుసగా ఎనిమిదవ రోజూ నష్టాలను వీడలేదు. కార్పొరేట్ సంస్థలు బలహీన త్రైమాసిక ఫలితాలకు విదేశీ మదుపర్ల అమ్మకాలు తోడవ్వడంతో శుక్రవారం సెన్సెక్స్(Sensex) 76,000పాయింట్ల దిగువకు చేరుకుంది. నిఫ్టీ(Nifty) కీలకమైన 23,000పాయింట్ల స్థాయిని కోల్పోయింది. చిన్న, మధ్య స్థాయి షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి 21పైసలు బలపడింది. దీంతో 86.71 దగ్గర ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.55శాతం పెరిగి 75.43డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.

బీఎస్ఈ(BSE)లో నమోదైన సంస్థల మొత్తం మార్కెట్ విలువ శుక్రవారం ఒక్కరోజే దాదాపు రూ. 7లక్షల కోట్ల మేర అవిరయ్యింది. గత 8 ట్రేడింగ్ రోజుల్లో రూ. 25.31 లక్షల కోట్లు తగ్గి రూ. 400.19 లక్సల కోట్లకు చేరుకుంది. గత ఎనిమిది రోజుల్లో సెన్సెక్స్ (Sensex) 2,644.6 పాయింట్ల నిఫ్టీ 810 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. 2024 సెప్టెంబర్ 27నాటి బీఎస్ఈ (BSE)కంపెనీల మొత్తం నమోదిత విలువ రూ. 477.93లక్షల కోట్లతో పోలిస్తే ఇప్పటికి ర. 77.74 లక్షల కోట్ల మేర క్షీణించింది.

సెన్సెక్స్ (Sensex) ఉదయం 250 పాయింట్ల లాభంతో 76,388.99దగ్గర ప్రారంభం అయ్యింది. ఇంట్రాడేలో 76,483.06పాయింట్ల దగ్గర గరిష్టాన్ని తాకిన సూచీ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 699.33 పాట్లంటు క్షీణించి 75,439.21 దగ్గర ముగిసింది. నిఫ్టీ 102.15 పాయింట్లు తగ్గి 22,929.25 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈసూచీ 22,774.85-23,133.70 పాయింట్ల మధ్య ఉంది. సెన్సెక్స్(Sensex) సూచీలో 21షేర్లు నష్టాలను చూశాయి. అదానీ పోర్ట్స్ 4.2శాతం ఆల్ట్రాటెక్ 2.47శాతం, సన్ ఫార్మా2.40శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.19శాతం, ఎన్టీపీసీ 2.18శాతం టాటా స్టీల్ 1.31శాతం, ఎం అండ్ ఎం 1.26శాతం, యాక్సెస్ బ్యాంక్ 1.14శాతం, టెక్ మహీంద్రా 1. 06శాతం కుదేలయ్యాయి. పోకస్డ్ ఐటీ మాత్రం కాస్త పెరిగింది. బీఎస్ఈలో 3386 షేర్లు నష్టాల్లో ముగిసాయి. 629 స్క్రీప్ లు లాభపడ్డాయి. 68షేర్లలో ఎలాంటి మార్పులు లేవు.

మెజార్టీ వాటా కోసం పోటీ ఓపెన్ ఆఫర్ ఇచ్చేందు దిగ్విజయ్ లక్మీసిన్హ్ గైక్వాడ్ చేసుకున్న దరఖాస్తుపై మార్కెట్ల నియంత్రన సంస్థ సెబీ తోసిపుచ్చింది. పోటీ ఓపెన్ ఆఫర్ ఇచ్చేందుకు అవసరమైన ఆర్థిక వనరులను వివరించడంలో దరఖాస్తు దారు విఫలమైనట్లు సెబీ వెల్లడించింది.

Next Story