Gold Rates Today- May 13: భారీగా తగ్గి స్పలంగా పెరిగిన బంగారం ధరలు..

by Kodari Anjali |

ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారు అభరణాలు ధరిస్తారు.

Gold Rates Today- May 13: భారీగా తగ్గి స్పలంగా పెరిగిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారు అభరణాలు ధరిస్తారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అనేక రకాల డిజైన్లతో లక్షల్లో విలువ చేసే కమ్మలు, నెక్లెస్‌లు, బ్యాంగిల్స్ వంటివి కొనుగోలు చేస్తుంటారు. ఆడవాళ్లకు ప్రతిరోజూ షాపింగ్ చేసిన బోర్ కొట్టదనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. కాగా గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అంటూ మహిళలు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు.

కాస్త పసిడి ధరలు తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో ఎగబడుతారు. అయితే ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ రేట్లతో మహిళల్లో ఓసారి ఉత్సాహం నెలకొనగా.. మరోసారి నిరాశకు గురవుతుంటారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. అయితే నిన్న భారీగా పడిపోవడంలో గోల్డ్ ప్రియులు సంతోషం వ్యక్తం చేశారు. ఈలోపే మళ్లీ బంగారం ధరల పెరిగడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నిన్న 22 క్యారెట్లు.. 10 గ్రాముల బంగారం రూ. 87, 500 ఉండగా.. నేడు రూ.150 పెరిగి రూ.87,650గా ఉంది.

ఇక నిన్న 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 95, 460 గా ఉంది. నేడు రూ. 160 పెరిగి రూ.95,620 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు నేడు కేజీ వెండికి వంద రూపాయలు మేర దిగి వచ్చి ఈ రోజు 1,09, 000 గా కొనసాగుతోంది.

హైదరాబాదులో నేటి బంగారం ధర..

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 87,650 (నిన్నటి ధర రూ. 87, 500)

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 87,650 (నిన్నటి ధర రూ. 95, 460)

విజయవాడలో నేటి బంగారం ధర..

22 క్యారెట్ల బంగారం ధర- రూ.87,650 (నిన్నటి ధర రూ. 87, 500)

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 87,650(నిన్నటి ధర రూ. 95, 460)

Next Story