- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Housing Market: ఇళ్ల అమ్మకాల్లో బెంగళూరు, హైదరాబాద్ టాప్
ఇళ్లకు డిమాండ్, తక్కువ ధరల ఇళ్ల సరఫరా తగ్గడం దీనికి ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో హౌసింగ్ మార్కెట్ అమ్మకాల్లో సగటున 2 శాతం క్షీణించాయని ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ ప్రాప్‌టైగర్ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి శనివారం నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, ఇళ్ల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 2 శాతం తగ్గి 95,973 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే సమయంలో 98,095 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. డిమాండ్, తక్కువ ధరల ఇళ్ల సరఫరా తగ్గడం దీనికి ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది. అయితే కొత్త ఇళ్ల సరఫరా మాత్రం దాదాపు స్థిరంగా ఉందని ప్రాప్‌టైగర్ సీఈఓ ప్రకాష్ తేజ్వాని చెప్పారు.
నగరాల వారీగా చూస్తే, బెంగళూరు ఈ త్రైమాసికంలో అత్యధిక అమ్మకాలను సాధించింది. సమీక్షించిన త్రైమాసికంలో 33 శాతం ఎక్కువగా 15,603 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో 25 శాతం పెరిగి 13,297 యూనిట్లు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 11 శాతం 9,447 యూనిట్లు, చెన్నైలో 6,841 యూనిట్లతో గణనీయమైన వృద్ధి నమోదైంది. ముఖ్యంగా జీసీసీలు (గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు), స్టార్టప్‌లు, డీప్-టెక్ కంపెనీల విస్తరణ బెంగళూరులో ఇళ్ల డిమాండ్‌ను పెంచింది. మరోవైపు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పూణే, అహ్మదాబాద్, కోల్‌కతా మార్కెట్లలో అమ్మకాలు తగ్గాయి. ఎంఎంఆర్‌లో విక్రయాలు 15 శాతం, పూణేలో 21 శాతం తగ్గాయి. అహ్మదాబాద్‌లో 23 శాతం, కోల్‌కతాలో 24 శాతం మేర అమ్మకాలు క్షీణించాయి. అధిక ధరలు, మధ్యతరగతి సెగ్మెంట్‌లో డిమాండ్ మందగించడం ఇందుకు కారణాలని నివేదిక వెల్లడించింది.






