- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Real Estate: స్థిరాస్తి రంగంలో భారత్ దూకుడు
ప్రస్తుత ఏడాది తొలి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 55 గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్‌లో భారత్ 15వ ర్యాంకును సాధించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: స్థిరాస్తి రంగంలో భారత్ అత్యంత మెరుగైన వృద్ధిని సాధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన దేశాల కంటే మన రియల్ ఎస్టేట్ రంగం సానుకూల గిరాకీని చూస్తోందని ఓ నివేదిక అభిప్రాయపడింది. తాజాగా నైట్‌ఫ్రాంక్ తాజా గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం, ప్రపంచ రియల్ ఎస్టేట్ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ భారత హౌసింగ్ మార్కెట్ మెరుగ్గా ఉంది. దేశంలో ఇళ్ల ధరలు ఏడాది ప్రాతిపదికన 7.7 శాతం పెరిగాయని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ఇది అగ్రరాజ్యం అమెరికా, యూకే లాంటి ప్రధాన ఆర్థికవ్యవస్థల కంటే ఎక్కువని పేర్కొంది. దీంతో ప్రస్తుత ఏడాది తొలి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 55 గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్‌లో భారత్ 15వ ర్యాంకును సాధించింది. త్రైమాసిక పరంగా కూడా దేశంలో ఇళ్ల ధరలు 2.9 శాతం మేర పెరిగాయి.
ముఖ్యంగా అంతర్జాతీయంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కొనుగోళ్లు కొనసాగడం, వినియోగదారుల విశ్వాసం పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణమని నివేదిక స్పష్టం చేసింది. దేశీయంగా హౌసింగ్ మార్కెట్ పటిష్టమైన గిరాకీ, పెరుగుతున్న ఆదాయాలు, పెట్టుబడిదారుల ఆసక్తి వంటి అంశాల కారణంగా వేగమందుకుంటోంది. ఈ ఏడాది వడ్డీ రేట్ల దిగిరావడంతో రానున్న రోజుల్లోనూ ఈ డిమాండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్య, ఖరీదైన ఇళ్ల విభాగంలో గిరాకీతో పాటు అమ్మకాలు కూడా మరింత పుంజుకుంటాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, ఎండీ శిశిర్ బైజల్ వెల్లడించారు. దేశ వృద్ధి రేటు స్థిరంగా ఉండటంతో భారత్ ఆకర్షణీయమైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా కొనసాగుతుందని ఆయన అన్నారు. కాగా, 55 దేశాల మార్కెట్లను ట్రాక్ చేసిన నైట్‌ఫ్రాంక్ టర్కీకి అగ్రస్థానం ఇచ్చింది. తర్వాత ఉత్తర మాసిడోనియా, పోర్చుగల్, మెయిన్ ల్యాండ్ చైనా, హాంకాంగ్ దేశాలు జాబితాలో ఉన్నాయి.






