- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HDFC Bank: సామాజిక సంక్షేమం, అభివృద్ధి కోసం రూ. 1,068 కోట్లు ఖర్చు చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాము సీఎస్ఆర్ కార్యక్రమాలపై రూ. 1,068.03 కోట్లు ఖర్చు చేశామని..

దిశ, బిజినెస్ బ్యూరో: కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద సామాజిక సంక్షేమం, అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్టు ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాము సీఎస్ఆర్ కార్యక్రమాలపై రూ. 1,068.03 కోట్లు ఖర్చు చేశామని, ఇది అంతకుముందు ఏడాది కంటే రూ. 123 కోట్లు ఎక్కువని వెల్లడించింది. బ్యాంకు వార్షిక సీఎస్ఆర్ నివేదిక ప్రకారం, 2025, మార్చి 31 నాటికి బ్యాంక్ ఇప్పటివరకు సీఎస్ఆర్ కార్యక్రమాల్లో రూ. 6,176 కోట్లు ఖర్చు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 'పరివర్తన్' కార్యక్రమానికి పదేళ్లు పూర్తయ్యాయని, దీని కింద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో 10.56 కోట్ల మంది జీవితాల్లో మార్పునకు కృషి చేసిందని బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకు తన సామాజిక కార్యక్రమం పరివర్తన్ ద్వారా ప్రజలు, సమాజం అభివృద్ధికి, మెరుగైన భవిష్యత్తు కోసం పని చేశాం. గత 10 ఏళ్లుగా బ్యాంకు అందరినీ కలుపుకునే, స్థానిక అవసరాలకు సరిపోయే, ప్రజలను భవిష్యత్తుకు సిద్ధం చేసే అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే, ప్రభుత్వం గుర్తించిన దేశంలోని 112 అత్యంత వెనుకబడిన జిల్లాల్లో 102 చోట్ల బ్యాంకు సామాజిక ప్రాజెక్టులను చేపట్టింది. దేశ సరిహద్దులకు సమీపంలో ఉన్న 298 గ్రామాలలో కూడా పనిచేశామని, ప్రధానంగా గ్రామీణాభివృద్ధికి మద్దతు ఇచ్చామని బ్యాంకు పేర్కొంది.






