HDFC Bank: వడ్డీ రేట్లను తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

by S Gopi |

సవరించిన రేట్లు బుధవారం(మే 7) నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

HDFC Bank: వడ్డీ రేట్లను తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్-బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. వివిధ కాలవ్యవధులను బట్టి 15 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను తగ్గించినట్టు బ్యాంకు తెలిపిది. సవరించిన రేట్లు బుధవారం(మే 7) నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. బ్యాంకు వివరాల ప్రకారం, ఓవర్‌నైట్, నెల రోజుల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయిట్లు తగ్గి 9 శాతానికి చేరుకుంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 15 బేసిస్ పాయింట్లు తగ్గి 9.05 శాతం, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 9.10 శాతం వద్ద ఉంది. మిగిలిన కాలవ్యవధులకు కాలపరిమితిని బట్టి 9 నుంచి 9.20 శాతం మధ్య ఉంటుంది. ఇదివరకు 9.10 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉండేది. ఎంసీఎల్ఆర్ రేటు వినియోగదారులు తీసుకునే గృహ, వాహన, వ్యక్తిగత, విద్యా రుణాలకు వర్తిస్తుంది. ఇప్పటికే బ్యాంకులో గృహరుణం తీసుకున్న వారికి, కొత్తగా తీసుకునే వారికి కొత్త రేట్ల ప్రకారం, 9 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభమవుతాయి.

Next Story