- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HDFC Bank: తగ్గనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈఎంఐ భారం
ఎంపిక చేసిన కాలవ్యవధులపై ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించినట్టు బ్యాంకు తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన నేపథ్యంలో, అందుకనుగుణంగా బ్యాంకులు వడ్డీ రేట్లలో సవరణలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. తాజాగా ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్లను(ఎంసీఎల్ఆర్) తగ్గించినట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఎంసీఎల్ఆర్ ఆధారంగా రుణాలు తీసుకున్న కస్టమర్లకు ఈఎంఐ భారం తగ్గనుంది. ఎంపిక చేసిన కాలవ్యవధులపై ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించినట్టు బ్యాంకు తెలిపింది. సవరించిన రేట్లు జూన్ 7వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయని బ్యాంకు పేర్కొంది. బ్యాంకు నిర్ణయం తర్వాత ఎంసీఎల్ఆర్ రేట్లు 8.90 శాతం నుంచి 9.10 శాతానికి చేరింది. ఇది వరకు ఇది 9 శాతం నుంచి 9.20 శాతం మధ్య ఉండేది. బ్యాంకు అధికారిక వివరాల ప్రకారం, ఓవర్‌నైట్, నెల రోజుల కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు తగ్గి వరుసగా 9 శాతం, 8.9 శాతానికి చేరింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 9.05 శాతం నుంచి 8.95 శాతానికి తగ్గింది. ఆరు నెలలకు 9.15 శాతం నుంచి 9.05 శాతానికి తగ్గింది. ప్రధానంగా కస్టమర్లు తీసుకునే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ప్రభావం చూపే ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్ 9.15 శాతం నుంచి 9.05 శాతానికి తగ్గించింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 9.10 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 9.10 శాతానికి బ్యాంకు తగ్గిస్తూ నిర్ణయించింది.






