HDFC Bank: తగ్గనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈఎంఐలు

by S Gopi |

బ్యాంకు నిర్ణయంతో వినియోగదారులు తీసుకునే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐల భారం తగ్గనుంది.

HDFC Bank: తగ్గనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈఎంఐలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు భారీ ఊరట కల్పించింది. బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. సవరించిన రేట్లు ఆగస్టు 7 నుంచే అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. బ్యాంకు నిర్ణయంతో వినియోగదారులు తీసుకునే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐల భారం తగ్గనుంది. ఎంపిక చేసిన రుణాల కాలవ్యవధులపై బ్యాంకు ఎంసీఎల్ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రిటైల్ రుణాలపై ప్రభావం చూపే ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ మాత్రం 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, సవరించిన తర్వాత రుణాల రేట్లు 8.55 శాతం నుంచి 8.75 శాతం మధ్య ఉంది. ఇదివరకు 8.60 శాతం నుంచి 8.80 శాతం మధ్య ఉండేది. కొత్త రేట్లకు సంబంధించి.. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.55 శాతానికి, 3 నెలల ఎంసీఎల్ఆర్ 8.60 శాతానికి, 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.70 శాతానికి, ఏడాది ఎంసీఎల్ఆర్ 9.05 శాతం నుంచి 8.75 శాతానికి తగ్గించింది. 2 ఏళ్ల ఎంసీఎల్ఆర్ 8.75 శాతం స్థిరంగా ఉంచింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.75 శాతానికి తగ్గించింది.

Next Story