- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు అలర్ట్.. ఈ రోజుల్లో సేవలు బంద్
by Naga Rani Yarlagadda |
తన ఖాతాదారులకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ కీలక అలర్ట్ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తన ఖాతాదారులకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ కీలక అలర్ట్ చేసింది. కొన్ని తేదీల్లో బ్యాంక్ కస్టమర్ కేర్ సర్వీసులు, వాట్సాప్ చాట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాకింగ్ (SMS Banking) వంటి సేవలను నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఆగస్టు 22, 25 తేదీల్ల్ బ్యాంక్ సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా కొన్ని సేవలను నిలిపివేయనున్నామని, ఇందుకు కస్టమర్లు సహకరించాలని కోరింది.
ఆగస్టు 22వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 23వ తేదీ ఉదయం 6 గంటల వరకూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ సమయంలో ఫోన్ బ్యాంకింగ్, ఐవీఆర్, ఈమెయిల్, సోషల్ మీడియా, చాట్ బ్యాంకింగ్ ఆన్ వాట్సాప్ సేవలు ఆగిపోనున్నాయి. టోల్ ఫ్రీ నంబర్ మాత్రం పనిచేస్తుందని, ఏటీఎం కార్డు సేవలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపింది.
Next Story






