- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HDFC Bank: వారంలో 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
బ్యాంక్‌లోని బిజినెస్, కార్పొరేట్ సపోర్ట్ విభాగాల్లో పనిచేసే ఎంపిక చేసిన ఉద్యోగులకు వారంలో రెండు రోజుల వర్క్-ఫ్రమ్-హోమ్ అవకాశం కల్పించాం.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను ప్రకటించింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చమురు సంక్షోభాన్ని నివారించేందుకు పొదుపు పాటించాలని, సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని సూచించిన నేపథ్యంలో బ్యాంకు ఆ దిశగా అడుగులు వేస్తోంది. బ్యాంక్‌లోని బిజినెస్, కార్పొరేట్ సపోర్ట్ విభాగాల్లో పనిచేసే ఎంపిక చేసిన ఉద్యోగులకు వారంలో రెండు రోజుల వర్క్-ఫ్రమ్-హోమ్ అవకాశం కల్పించాం. ముఖ్యంగా బ్యాంకులోని ఇంటర్నల్ విభాగాలు హెచ్ఆర్, ఫైనాన్స్, ట్రెజరీ ఆపరేషన్స్, బ్యాంకు లావాదేవీలు చూసే ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఈ నిర్ణయం ఇప్పటికే అమల్లోకి వచ్చిందని, వచ్చే 30 రోజుల పాటు ట్రయల్ బేసిస్‌పై కొనసాగుతుందని బ్యాంకు తెలిపింది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి సమీక్ష ఆధారంగా కొనసాగించడంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే ఈ మార్పు కస్టమర్లతో నేరుగా పని చేసే బ్రాంచ్ ఉద్యోగులపై ప్రభావం చూపదని, బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది.






