- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Petrol Diesel Prices: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయా, పెరిగాయా?
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు స్థిరంగా ఉండటంతో, మార్చి 1వ తేదీ నాటి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఏం కనిపించడం లేదు.

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ రీసెంట్‌గా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. గత నెల(ఫిబ్రవరి)లో వీటి ధరల్లో ఎలాంటి మార్పులు లేవనే విషయం తెలిసిందే. ఇక, ఈ నెల(మార్చి)లో ధరల్లో మార్పులు జరిగి రేట్లు తగ్గుతాయని వాహనదారులు ఆశ పడ్డారు. కానీ వారికి నిరాశే మిగిలింది.
ఈ నేపథ్యంలో ఈ రోజు(మార్చి 01) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర నేడు(ఆదివారం) రూ.107.50గా ఉంది, లీటర్ డీజిల్ ధర రూ. 95.70గా ఉంది. అలాగే, ఏపీలోని విశాఖపట్నంలో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ.108.35, లీటర్ డీజిల్ ధర రూ.96.22 గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.83, లీటర్ డీజిల్ ధర రూ. 97.66గా ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు స్థిరంగా ఉండటంతో, మార్చి 1వ తేదీ నాటి పెట్రోల్, డీజిల్ ధరలు చూసినట్లయితే గత నెలతో పోల్చితే పెద్దగా మార్పులు ఏం కనిపించడం లేదు.






