- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tata EV: ఒక్క ఛార్జ్‌తో 627 కి.మీ రేంజ్.. హారియర్ ఈవీ విడుదల చేసిన టాటా
ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 15 నిమిషాల్లోనే 250 కి.మీ రేంజ్ ఛార్జింగ్ చేసుకునే వీలుంటుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈవీ మార్కెట్లో తన మోడళ్లతో ఆకట్టుకున్న కంపెనీ, తాజాగా తన ఈవీ పోర్ట్‌ఫోలియోలో ఫ్లాగ్‌షిప్ మోడల్ టాటా హారియర్‌ను కూడా చేర్చింది. మంగళవారం ఈవీ హారియర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. సాంప్రదాయ ఇంధన వేరియంట్ తరహాలోనే లగ్జరీ కార్లలో లభించే స్థాయి ఫీచర్లను కంపెనీ ఇందులో అందించింది. నాలుగు రంగుల్లో తీసుకొచ్చిన ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 627 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 15 నిమిషాల్లోనే 250 కి.మీ రేంజ్ ఛార్జింగ్ చేసుకునే వీలుంటుంది. దీని ధరను రూ. 21.49 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. వినియోగదారుల కోసం బ్యాటరీ ప్యాక్‌పై లైఫ్‌టైమ్ వారెంటీ ఇస్తున్నట్టు పేర్కొంది. ఈ కారు కొనాలనుకునే వారు జూలై 2వ తేదీ నుంచి బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. టాటా ఈవీ హారియర్ కేవలం 6.3 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. టెక్నాలజీ పరంగా డ్రిఫ్ట్, బూస్ట్ మోడ్‌లో డ్యూయల్ మోటార్ క్యూడబ్ల్యూడీ (క్వాడ్ వీల్ డ్రైవ్) నాలుగు టైర్లకూ పవర్ అందుతుంది. అలాగే, ట్రాన్స్‌పరెంట్ మోడ్‌లో వాహనానికి కింద భాగంలో రోడ్డును స్క్రీన్‌లో చూసే సదుపాయం కూడా ఉందని కంపెనీ వివరించింది.






