- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Crude oil: నిబంధనల ప్రకారమే రష్యా చమురు కొనుగోళ్లు
ఆయన వ్యాఖ్యలు వాస్తవానికి ఏ మాత్రం పొంతనలేదని తెలిపారు.

దిశ, బిజినెస్ బ్యూరో: రష్యా చమురు, ఇంధన వాణిజ్యాన్ని కొనుగోలు చేయడంలో భారత్ ఎటువంటి నియమాలను ఉల్లంఘించలేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. సోమవారం ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. భారత ప్రభుత్వం అంతర్జాతీయ నిబంధనలను గౌరవించడంతోనే గ్లోబల్ మార్కెట్లలో చమురు ధరలు పెరగకుండా స్థిరంగా ఉన్నాయి. ఈ సందర్భంగా వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో రష్యా చమురుకు భారత్ 'లాండ్రోమ్యాట్'గా మారిందన్న వ్యాఖలను కేంద్ర మంత్రి తోసిపుచ్చారు. ఆయన వ్యాఖ్యలు వాస్తవానికి ఏ మాత్రం పొంతనలేదని తెలిపారు. అంతేకాకుండా రష్యా చమురును కొనుగోలు చేసి భారత్ లాభపడిందనే వ్యాఖ్యలనూ ఆయన తిప్పికొట్టారు. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి చాలా కాలం ముందు నుంచే భారత్ అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశంగా ఉందని, ఎగుమతుల పరిమాణం, మార్జిన్‌లు అంతే ఉన్నాయని అన్నారు.
కొంతమంది విమర్శకులు భారత్ రష్యా చమురు కోసం 'లాండ్రోమాట్'గా మారిందని ఆరోపిస్తున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదనిని పేర్కొన్నారు. రష్యా నుంచి కొనే చమురు ధరలు జీ7 దేశాలు విధించే ప్రైస్ క్యాప్‌కు అనుకూలంగా ఉన్నాయి.ఈ ప్రైస్ క్యాప్ జీ7 దేశాలు రష్యా ఆదాయాన్ని నియంత్రించడం కోసం తెచ్చిందనే విషయాన్ని గుర్తించుకోవాలి. ప్రపంచ చమురు ధరలను స్థిరంగా ఉండటంలో కీలక యంత్రాంగంగా భారత్ పని చేస్తోందని మంత్రి వెల్లడించారు. కాగా, ఇటీవల పీటర్ నవారో మాట్లాడుతూ, భారత్ లాండ్రోమ్యాట్‌గా ఉండటం మూలంగా ఓ వర్గం లాభపడుతోంది. అందుకు భారత్ తన ప్రజలను పణంగా పెడుతోందని, దాన్ని అడ్డుకోవాలన్నారు. ఉక్రెయిన్ ప్రజలను బలి తీసుకుంటున్న ఈ ధోరణి, అమెరికనలు చెల్లింపుదారులుగా ఏం చేయాలనేది చూడాలన్నారు. భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేత నరేంద్ర మోడీ పుతిన్, జిన్‌పింగ్‌లతో ఎందుకని అంటకాగుతున్నారో అర్థం కావట్లేదని అన్నారు. ఈ క్రమంలోనే హర్దీప్ సింగ్ తాజా వ్యాఖ్యలు చేశారు.






