Wealth: దేశంలోని సగం జనాభా వద్ద రూ. 3.5 లక్షలు కూడా లేవు

by S Gopi |

దీన్ని ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రమైన అసమానతలకు హెచ్చరికగా చూడాలని ఆయన సూచించారు.

Wealth: దేశంలోని సగం జనాభా వద్ద రూ. 3.5 లక్షలు కూడా లేవు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోని సగం జనాభా వద్ద ఆర్థిక భద్రతకు కనీసం రూ. 3.5 లక్షల సొమ్ము కూడా లేదని ఓ ఫైనాన్షియల్ ప్లానర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కూడా 90 శాతం మంది ఒక్క నెల జీతం లేకపోయినా జీవించలేని స్థితిలో ఉన్నారని చెన్నైకి చెందిన ఫైనాన్షియల్ ప్లానర్ డి ముత్తుకృష్ణన్ చెప్పారు. ఈ గణాంకాలు అంతర్జాతీయంగా ఏఐ, ఆటోమేషన్, ఉద్యోగ అస్థిరత్వాన్ని సూచిస్తుందని, దీన్ని ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రమైన అసమానతలకు హెచ్చరికగా చూడాలని ఆయన సూచించారు. ముఖ్యంగా సంపద కేంద్రీకరణ, సాంకేతిక విఘాతం ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లోని కోట్లాది మందిని భవిష్యత్తులో మరింత బలహీనంగా ఉంచుతాయనే సందేహాలున్నాయని ముత్తుకృష్ణన్ వివరించారు. ఇదే సమయంలో సంపన్న దేశాలతో పోల్చినప్పుడు, భారత్ గురించి ఎంత వీలైతే అంత తక్కువగా చెప్పుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు స్విట్జర్లాండ్‌లోని 1 శాతం మంది వద్ద 43 శాతం దేశ సంపద ఉంది. మొదటి 7 శాతం మంది వద్ద దేశ సంపదలోని 70 శాతం కంటే ఎక్కువ కలిగి ఉన్నారు. ఈ అసమానత అంతర్జాతీయంగా ప్రతి చోటా ఉంది. అయినప్పటికీ స్విట్జర్లాండ్ సగటు సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా ఉంది. వయోజనుడైన ప్రతి వ్యక్తి సగటున 685,000 డాలర్లు(మన కరెన్సీలో రూ. 6 కోట్లు) కలిగి ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా సగం మంది రూ. 7.5 లక్షల కంటే తక్కువ సొమ్ము తమ వద్ద కలిగి ఉన్నారు. భారత్‌లోని సగం జనాభా వద్ద రూ. 3.5 లక్షల కంటే తక్కువ ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలు ఉన్నాయి, కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ సంపన్నులు ఉన్నారు. ప్రపంచంలోని వయోజన జనాభాలో కేవలం 1 శాతం మంది వద్ద మాత్రమే రూ. 8.6 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉందని ముత్తుకృష్ణన్ వెల్లడించారు.

Next Story