GST Collection: వరుసగా తొమ్మిదో నెలా రూ. 1.8 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

by S Gopi |

గత నెలలో వచ్చిన భారీ వసూళ్ల కారణంగా వరుసగా తొమ్మిదవ నెలా జీఎస్టీ ఆదాయం రూ. 1.8 లక్షల కోట్ల మార్కును దాటాయి. అ

GST Collection: వరుసగా తొమ్మిదో నెలా రూ. 1.8 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సెప్టెంబర్ నెలలో రూ. 1.89 లక్షల కోట్లకు పెరిగాయి. ఇది గతేడాదితో పోలిస్తే 9.1 శాతం వృద్ధి నమోదైంది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆర్థికశాఖ గణాంకాలను విడుదల చేసింది. అంతకుముందు ఆగష్టులో జీఎస్టీ ఆదాయం రూ. 1.86 లక్ష కోట్లతో పోలిస్తే 6.5 పెరిగాయి. గత నెలలో వచ్చిన భారీ వసూళ్ల కారణంగా వరుసగా తొమ్మిదవ నెలా జీఎస్టీ ఆదాయం రూ. 1.8 లక్షల కోట్ల మార్కును దాటాయి. అయితే, సెప్టెంబర్ నెల వసూళ్లలో ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల ప్రభావం ఉండదు. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ రేట్లు అక్టోబర్ జీఎస్టీ వసూళ్లలో ప్రతిబింబిస్తాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, సమీక్షించిన నెలలో మొత్తం జీఎస్టీ ఆదాయం రూ. 1,89,017 కోట్లుగా ఉంది. మొత్తం వసూళ్లలో దేశీయంగా వచ్చిన ఆదాయం రూ. 1,36,525 కోట్లు, దిగుమతుల నుంచి వచ్చే ఆదాయం రూ. 52,492 కోట్లకు చేరాయి. జీఎస్టీ వాపసులు 20 శాతం తగ్గి రూ. 19,359 కోట్లకు చేరుకున్నాయి. సీజీఎస్టీ రూ.33,645 కోట్లు కాగా, ఎస్‌జీఎస్టీ రూ.41,836 కోట్లు, ఐజీఎస్టీ రూ.1,01,883 కోట్లు, సెస్సు రూ. 11,652 కోట్లు వచ్చాయి.

తెలంగాణ, ఏపీలో వసూళ్లు

సెప్టెంబర్ నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లలో తెలంగాణలో 5 శాతం క్షీణించి రూ. 4,998 కోట్లు వచ్చాయి. ఇక, తెలంగాణ జీఎస్టీ ఆదాయం 4 శాతం పెరిగి రూ. 3,653 కోట్లు వచ్చాయని కేంద్రం పేర్కొంది.

Next Story