- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GST: జీఎస్టీ రేట్ల తగ్గింపుతో 25 బేసిస్ పాయింట్లు తగ్గనున్న ద్రవ్యోల్బణం
ఈ కొత్త జీఎస్టీ రేట్ల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: సామాన్యులపై నిత్యావసర వస్తువుల భారం తగ్గించేందుకు కేంద్రం జీఎస్టీ రేట్లను రెండు శ్లాబులకు కుదించింది. పన్ను నిర్మాణాన్ని సరళీకృతం చేయడంతో వివిధ వస్తువులపై రేట్లు తగ్గడం, తద్వారా సామాన్యులతో పాటు వ్యాపారాలకు కూడా ప్రయోజనం ఉంటుంది. ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త జీఎస్టీ రేట్ల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రోజువారీ వస్తువులపై గణనీయమైన పన్ను తగ్గింపుతో వినియోగదారుల ధరల ఆధారిత సూచీ(సీపీఐ) ద్రవ్యోల్బణం 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఈస్థాయిలో పన్ను రేట్లను తగ్గించడం వల్ల ప్రభుత్వానికి రూ. 48,000 కోట్ల మేర నష్టం ఏర్పడవచ్చు. అయితే, అదే స్థాయిలో వ్యవస్థలో డిమాండ్ పుంజుకుంటే జరిగే నష్టాన్ని భర్తీ చేసే వీలుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో పాటు జీఎస్టీ రేట్ల కుదింపు ద్వారా ప్రభుత్వ ఆర్థిక లోటు 40 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశమని బెర్న్‌స్టెయిన్ తెలిపింది. ఆదాయం, ఖర్చుల మధ్య వ్యత్యాసాన్ని ఆర్థిక లోటుగా పరిగణిస్తారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల ఆర్థిక లోటు ప్రతికూలంగా ప్రభావితమై 40 బేసిస్ పాయింట్ల వరకు పెరుగుతుందని అంచనా. దీనివల్ల ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం సవాలుగా మారవచ్చు. అయినప్పటికీ, వినియోగం పెరిగి, ఆర్థిక వృద్ధి ఏర్పడితే ఈ ప్రతికూల ప్రభావన్ని భర్తీ చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది.






