Retailers: జీఎస్టీ డిస్కౌంట్లపై రిటైలర్లకు కేంద్రం కీలక ఆదేశాలు

by S Gopi |

రసీదులు, బిల్లులపైన 'జీఎస్టీ డిస్కౌంట్' టైటిల్ కింద స్పష్టంగా తగ్గింపు ఎంతనేది కనిపించేలా చూసుకోవాలని ఆదేశించింది.

Retailers: జీఎస్టీ డిస్కౌంట్లపై రిటైలర్లకు కేంద్రం కీలక ఆదేశాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉన్న రిటైలర్లకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మార్పులకు సంబంధించి దేశంలో ప్రధాన రిటైలర్లు డిస్కౌంట్లను స్పష్టంగా కనిపించేలా ప్రకటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత రిటైలర్ అసోసియేషన్‌కు డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఏఈఇటీ) నోట్ పంపింది. రసీదులు, బిల్లులపైన 'జీఎస్టీ డిస్కౌంట్' టైటిల్ కింద స్పష్టంగా తగ్గింపు ఎంతనేది కనిపించేలా చూసుకోవాలని ఆదేశించింది. తగ్గింపు వివరాలు కనిపించడం ముఖ్యమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల తగ్గింపు గురించి ప్రింట్, టెలివిజన్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో పోస్టర్లు, పాంప్లేట్ వంటి మార్గాలను ఉపయోగించాలని కోరింది. దీన్ని బట్టి రిటైలర్లు వచ్చే కొన్ని వారాల పాటు తమ అమ్మకాలను పెంచుకునే వ్యూహాలను అనుసరించడమే కాకుండా దుకాణాల వద్ద పన్ను సంస్కరణలు ఎంత సమర్థవంతంగా అమలవుతున్నాయో కూడా పరిశీలించాల్సి ఉంటుంది. పన్ను తగ్గింపు ప్రయోజనాలకు సంబంధించి ఈ ఏడాది పండుగ సీజన్ సమయంలో అమ్మకాల వాల్యూమ్‌లను ట్రాక్ చేయాలని, డేటా ప్రదర్శించాలని అధికారులు రిటైలర్లకు సూచించారు.

Next Story