BoB: జీఎస్టీ సంస్కరణలతో రూ. లక్ష కోట్లు పెరగనున్న వినియోగం

by S Gopi |

ఇది దేశ జీడీపీలో దాదాపు 0.2-0.3 శాతానికి సమానం.

BoB: జీఎస్టీ సంస్కరణలతో రూ. లక్ష కోట్లు పెరగనున్న వినియోగం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవలి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణల కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి దేశంలో వినియోగం గణనీయంగా పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక తెలిపింది. జీఎస్టీ శ్లాబుల తగ్గింపు ద్వారా వినియోగం రూ. 70,000 కోట్ల నుంచి రూ. 1 లక్షల కోట్లు పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. ఇది దేశ జీడీపీలో దాదాపు 0.2-0.3 శాతానికి సమానం. తగ్గిన సెస్ ద్వారా వినియోగదారులు చేసే పొదుపు కూడా అధిక డిమాండ్‌కు దారితీయవచ్చు. కాబట్టి ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండవచ్చని నివేదిక అభిప్రాయపడింది. పన్ను రేట్ల మార్పుతో వినియోగ వస్తువులు (ఎఫ్ఎంసీజీ), మన్నికైన వస్తువులు సహా చాలా రోజువారీ ఉత్పత్తులు 5 శాతం జీఎస్టీ బ్రాకెట్‌లోకి వచ్చాయి. రేట్ల తగ్గింపు వల్ల ప్రభుత్వానికి ఆదాయం క్షీణించినప్పటికీ, పూర్తిస్థాయిలో జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తే వినియోగానికి రూ. లక్ష కోట్ల పైనే దోహదపడుతుందని నివేదిక అభిప్రాయపడింది. దీనివల్ల ద్రవ్యోల్బణం కూడా కనీసం 55-75 బేసిస్ పాయింట్లు తగ్గేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఫుడ్ అండ్ డ్రింక్ విభాగంలో ద్రవ్యోల్బణం వచ్చే ఆరు నెలల్లో కనీసం 25-35 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చు. స్నాక్స్, వంటనూనె, ఇతర పదార్థాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. జీఎస్టీ రేట్ల కోత ప్రకారం రోజువారీ వస్తువులు, ఆహార పదార్థాల ధరలు సగటున 7.4 శాతం తగ్గుతాయని నివేదిక పేర్కొంది.

Next Story