- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GST: జీఎస్టీ సంస్కరణలతో మరింత చౌకగా బయోగాస్ ప్లాంట్లు, పరికరాలు
బయోగ్యాస్ ప్లాంట్లు, పరికరాలు చౌకగా, మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని ఐబీఏ ఒక ప్రకటనలో తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: బయోగ్యాస్ ప్లాంట్లు, పరికరాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను పెంచుతుందని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ ఆదివారం తెలిపింది. ఇటీవల జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం బయోగ్యాస్ ప్లాంట్లు, పరికరాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. కొత్త పన్నులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. బయోగ్యాస్ ప్లాంట్లు, పరికరాలు చౌకగా, మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని, పెట్టుబడులకు మరింత ఆకర్షణీయంగా మారుతాయని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ (ఐబీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. సీబీజీ(కంప్రెస్డ్ బయోగ్యాస్) రంగానికి వర్తించే జీఎస్టీ రేటులో 7 శాతం (12 శాతం నుంచి 5 శాతానికి) తగ్గింపు ప్రాజెక్టుల లాభదాయకతను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఇది ప్రత్యక్ష ప్రభావం చూపగలదు, పరిశ్రమకు కొత్తగా 4-5 శాతం పెట్టుబడులు పెరుగుతాయి. పరోక్షంగా పరిశ్రమ వ్యాప్తంగా మరిన్ని అవకాశాలు ఉంటాయని ఐబీఏ అభిప్రాయపడింది. 2030 నాటికి భారతీయ సీబీజీ పరిశ్రమలోకి 4-5 బిలియన్ డాలర్ల(రూ. 35-45 వేల కోట్ల) ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయని అంచనా.






