GST: సామాన్యులకు జీఎస్టీ బొనాంజా

by S Gopi |

సవరించిన కొత్త రేట్లు ఈ నెల 22 నుంచే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు.

GST: సామాన్యులకు జీఎస్టీ బొనాంజా
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జీఎస్‌టీ కౌన్సిల్ 56వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో కేంద్రం ప్రతిపాదించిన జీఎస్‌టీ సంస్కరణలలో భాగంగా ప్రస్తుతం ఉన్న 12%, 28% పన్ను శ్లాబులను తొలగించి, రెండు శ్లాబులు మాత్రమే కొనసాగించనున్నారు. సవరించిన కొత్త రేట్లు ఈ నెల 22 నుంచే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. లగ్జరీ వస్తువులపై మాత్రం 40 శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. కౌన్సిల్ సమాచేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. జీఎస్టీ వ్యవస్థలో 2 శ్లాబులను మాత్రమే ఉంచాలని నిర్ణయించాం. దీనివల్ల రైతులు, సామాన్యులకు ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా వ్యవసాయ, వైద్య రంగాలకు ఊరట లభిస్తుంది. సామాన్యులు, పేదలు కొనుగోలు చేసే వస్తువులపై ఇక నుంచి 5 శాతం, మిగిలిన వాటిపై 18 శాతం జీఎస్టీ ఉంటుందని చెప్పారు. సమావేశంలో తీసుకున్న పూర్తి నిర్ణయాలను గురువారం బహిరంగంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఇక నుంచి 2 శ్లాబులే

ప్రస్తుతం 5, 12, 18, 28 శాతాల శ్లాబులతో ఉన్న జీఎస్టీ చట్టాన్ని మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కేవలం రెండు ప్రధాన 5%, 18% శ్లాబులుగా మార్చింది. కొన్ని రకాల ఉత్పత్తులు, లగ్జరీ వస్తువులపై మాత్రం 40 శాతం జీఎస్టీ ఉంటుంది. ఈ నిర్ణయంతో అనేక వస్తువులపై పన్ను భారం తగ్గుతుంది.

మినహాయింపు ఇచ్చినవి

* రోజువారీ ఉపయోగించే ప్యాక్ చేయని ఆహార పదార్థాలపై ఎలాంటి పన్ను ఉండదు

* వ్యక్తిగత, జీవిత బీమా ఇన్సూరెన్స్‌లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు.

* మ్యాప్‌లు, చార్ట్‌లు, గ్లోబ్‌లు, పెన్సిల్స్, షార్పెనర్‌లు, క్రేయాన్‌లు, పాస్టెల్‌లు, నోట్‌బుక్‌లు,

ఎరేజర్ వంటి వస్తువులపై 12 శాతం నుంచి ఉన్న జీఎస్టీని తొలగించారు.

పన్ను రేట్లు తగ్గిన ఉత్పత్తులు:

రోజువారీ నిత్యావసరాలు:

* వెన్న, నెయ్యి, చీజ్, జామ్‌లు, సాస్‌లు, సూప్‌లు, పాస్తా, నామ్‌కీన్‌లు: 5 శాతం (12-18% నుంచి తగ్గాయి)

* బాదం, పిస్తాపప్పులు, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్: 5 శాతం (12 శాతం నుంచి తగ్గాయి)

* యూటీఎహ్చ్ పాలు, పనీర్, పరాఠాలు, పిజ్జా బ్రెడ్, ఖాఖ్రా, రోటీ: మినహాయింపు

* వంట సామగ్రి 5 శాతం(12 శాతం నుంచి తగ్గాయి)

* ఫీడింగ్ బాటిల్స్, బేబీస్ కోసం నేప్‌కిన్‌లు, క్లినికల్ డైపర్లు, కుట్టు యంత్రాలు, విడిభాగాలు 5 శాతం(12 శాతం నుంచి తగ్గాయి)

రైతులు, వ్యవసాయ రంగం

ట్రాక్టర్ టైర్లు, విడి భాగాలు 5 శాతం(18 శాతం నుంచి తగ్గాయి)

ట్రాక్టర్లు 5 శాతం(12 శాతం నుంచి తగ్గాయి)

నిర్దిష్ట బయో-పురుగుమందులు, సూక్ష్మ పోషకాలు 5 శాతం(12 శాతం నుంచి తగ్గాయి)

డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, స్ప్రింక్లర్లు 5 శాతం (12 శాతం నుంచి తగ్గాయి)

నేల తయారీ, సాగు, పంటకోత కోసం వ్యవసాయ, ఉద్యాన లేదా అటవీ యంత్రాలు, నూర్పిడి 5 శాతం(18 శాతం నుంచి తగ్గాయి)

ఆరోగ్య సంరక్షణ:

* ప్రాణాలను రక్షించే మందులు: 5 శాతం లేదా మినహాయింపు

* ధర్మామీటర్ 5 శాతం(18 శాతం నుంచి తగ్గాయి)

* మందులు, వైద్య పరికరాలు: 5 శాతం (12-18 శాతం నుంచి తగ్గాయి)

* డయాగ్నస్టిక్ కిట్‌లు, రియాజెంట్‌లు 5 శాతం(12 శాతం నుంచి తగ్గాయి)

* గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్‌లు, కరెక్టివ్ గ్లాసెస్ 5 శాతం(12 శాతం నుంచి తగ్గాయి)

* హెయిర్ ఆయిల్, షాంపూలు, టూత్‌పేస్ట్, సబ్బులు, షేవింగ్ ఉత్పత్తులు: 5 శాతం (18 శాతం నుంచి తగ్గాయి)

రవాణా:

* చిన్న కార్లు: 18 శాతం (28 శాతం నుంచి తగ్గాయి)

* పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, ఎల్‌పీజీ,సీఎన్‌జీ కార్లు (1200సీసీ, 4000ఎంఎం మించకూడదు) 18 శాతం(28 శాతం నుంచి తగ్గాయి)

* త్రీ-వీలర్లు 18 శాతం(28 శాతం నుంచి తగ్గాయి)

* అంబులెన్స్‌లు: 18 శాతం ( 28 శాతం నుంచి తగ్గాయి)

* ట్రాక్టర్లు, సైకిళ్ళు, 350సీసీ లోపు మోటార్ సైకిళ్లు: 18 శాతం(28 శాతం నుంచి తగ్గాయి)

* సరుకు రవాణా వాహనాలు 18 శాతం(28 శాతం నుంచి తగ్గాయి)

ఇతర ఉత్పత్తులు:

* సిమెంట్: 18 శాతం (28 శాతం నుంచి తగ్గాయి)

* మార్బుల్, గ్రానైట్ బ్లాక్స్: 5 శాతం

* పర్యావరణ అనుకూల నిర్మాణ వస్తువులు: 5 శాతం

* ఎయిర్ కండిషనర్లు 18 శాతం (28 శాతం నుంచి తగ్గాయి)

* టెలివిజన్ (32 అంగుళాల కంటే ఎక్కువ) (ఎల్ఈడీ, ఎల్‌సీడీ టీవీలతో సహా) 18 శాతం( 28 శాతం నుంచి తగ్గాయి)

* మానిటర్లు, ప్రొజెక్టర్లు 18 శాతం(28 శాతం నుంచి తగ్గాయి)

డిష్ వాషింగ్ మెషీన్లు 18 శాతం(28 శాతం నుంచి తగ్గాయి)

పెరిగిన పన్ను రేట్లు కలిగిన ఉత్పత్తులు:

లగ్జరీ వస్తువులు:

* ఎస్‌యూవీలు, పెద్ద కార్లు: 40 శాతం (28 శాతం నుంచి పెరిగాయి)

* 350సీసీ కంటే ఎక్కువ మోటార్ సైకిళ్లు: 40 శాతం (28 శాతం నుంచి పెరిగాయి)

* పడవలు, ప్రైవేట్ విమానాలు, రివాల్వర్లు, పిస్టల్స్: 40 శాతం

సిన్ గూడ్స్:

* పాన్ మసాలా, గుట్కా, పొగాకు, సిగరెట్లు: 40 శాతం (28 శాతం నుంచి పెరిగాయి)

* కార్బోనేటేడ్ శీతల పానీయాలు, కెఫిన్ కలిగిన పానీయాలు, ఫ్రూట్ జ్యూస్: 40 శాతం (28 శాతం నుంచి పెరిగాయి)

Next Story