Online Fraud: ఆన్‌లైన్ షాపింగ్ మోసాలపై కేంద్రం అలర్ట్

by S Gopi |

ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని సైబర్‌క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ సూచించింది.

Online Fraud: ఆన్‌లైన్ షాపింగ్ మోసాలపై కేంద్రం అలర్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ షాపింగ్ గతంలో కంటే మరింత సౌకర్యవంతంగా మారింది. అయితే, ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ, సైబర్ మోసగాళ్లకు సామాన్యులు లక్ష్యంగా మారుతున్నారు. ఈ స్కామర్లు ఫిషింగ్ మెసేజ్‌లను పంపడం, నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించడం, వ్యక్తిగత సమాచారాన్ని మోసపూరితంగా సేకరిస్తున్నారు. అంతేకాకుండా దిగ్గజ ఇ-కామర్స్ సైట్‌ల నుంచి కస్టమర్ సర్వీస్ ప్రతినిధులుగా నటిస్తూ వినియోగదారులకు కాల్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రజలను అప్రమత్తం చేసే చర్యలు చేపడుతోంది. తాజాగా ఇలాంటి ఆన్‌లైన్ స్కామ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించి ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని సైబర్‌క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ సూచించింది. ఆఫర్ల పేరుతో వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని స్పష్టం చేసింది. నకిలీ షాపింగ్ వెబ్‌సైట్‌లు, ఫిషింగ్ డెలివరీ మెసేజ్‌లు, స్కామ్ లింక్‌ల పట్ల ఆన్‌లైన్ షాపర్స్ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ముఖ్యంగా ఫిషింగ్‌ డెలివరీ టెక్స్ట్, నకిలీ షాపింగ్‌ సైట్స్‌, సోషల్‌మీడియా యాడ్స్‌,పేమెంట్ స్కామ్స్‌ వంటి మోసాలు పెరుగుతున్నాయి. గుడ్డిగా దేన్నీ క్లిక్ చేయవద్దు. అధికారిక, నమ్మకమైన ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రమే షాపింగ్ చేయాలని స్పష్టం చేసింది.

Next Story