- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Reliance: బ్యాటరీ సెల్ ప్లాంట్ ఏర్పాటులో ఆలస్యం కారణంగా రిలయన్స్‌కు జరిమానా
రిలయన్స్ న్యూ ఎనర్జీ బ్యాటరీ స్టోరేజ్ లిమిటెడ్ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులను అందుకుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: బ్యాటరీ సెల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంలో ఆలస్యం చేసిన కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ప్రభుత్వం జరిమానా విధించింది. బ్యాటరీ సెల్ ప్లాంట్ కోసం ప్రభుత్వం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం కింద ప్రోత్సాహకాలను కూడా మంజూరు చేసింది. ఈ మేరకు రిలయన్స్ సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, తన అనుబంధంగా ఉన్న రిలయన్స్ న్యూ ఎనర్జీ బ్యాటరీ స్టోరేజ్ లిమిటెడ్ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులను అందుకుంది. గతంలో పీఎల్ఐ పథకం కింద అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్స్ కోసం 5 గిగావాట్ అవర్ ఉత్పాదక సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు కోసం జరిగిన ఒప్పందం ముందుకెళ్లలేదు. ఫలితంగా ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆలస్యమయ్యే ప్రతి రోజు 0.1 శాతం చొప్పున లిక్విడేటెడ్ నష్టపరిహారం విధించనున్నట్టు మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో మార్చి 3 నాటికి లిక్విడేటెడ్ నష్టపరిహారం రూ. 3.1 కోట్లుగా లెక్కించినట్టు కంపెనీ పేర్కొంది. అయితే, మంత్రిత్వ శాఖతో కుదిరిన ఒప్పందంలో భాగంగా మొదటిదశను పూర్తి చేసేందుకు సమయం పొడిగించాలని కంపెనీ కోరింది. కాగా, 2022లో రిలయన్స్ అనుబంధ కంపెనీ పీఎల్ఐ పథకం ద్వారా 10 గిగావాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో కూడిన ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ఒప్పందంపై సంతకం చేసుకుంది.






