E Commerce Platforms: జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రభుత్వం నిఘా

by S Gopi |

ఈ ప్లాట్‌ఫామ్‌లు నిబంధనలను పాటిస్తున్నాయా, పన్ను తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు ఇచ్చాయో లేదో అధికారులు సమీక్ష ..

E Commerce Platforms: జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రభుత్వం నిఘా
X

దిశ, బిజినెస్ బ్యూరో: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేటు తగ్గింపుల ప్రయోజనాలు వినియోగదారులకు పారదర్శకంగా అందుతున్నాయా లేదా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తోంది. షాంపూల నుంచి పప్పుధాన్యాల వరకు రోజువారీ ఉపయోగించే ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు, అందుకోసం ప్రభుత్వం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై నిఘా ఉంచినట్టు మంగళవారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లు ధరల నిబంధనలను పాటిస్తున్నాయా, పన్ను తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు ఇచ్చాయో లేదో అధికారులు సమీక్ష జరుపుతున్నారు. కొన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రోజువారీ నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించలేదని ఫిర్యాదుల భారీగా పెరిగాయి. దీంతో జీఎస్టీ కోతలను సజావుగా, వాస్తవంగా అమలు చేయడం, పన్నులు ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తగ్గించారా లేదా అని రెవెన్యూ శాఖ పర్యవేక్షిస్తోంది. కొన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు జీఎస్టీ తగ్గింపునకు ముందు, తర్వాత ధరల వ్యత్యాసాల గురించి అడిగినప్పుడు 'సాంకేతిక లోపాలను' సాకుగా చెబుతున్నాయి. ఇలాంటి వైఖరిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Next Story