- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
EVs: అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు సౌండ్ అలర్ట్ సిస్టమ్ తప్పనిసరి
అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు అలర్ట్ సిస్టమ్ (ఏవీఏఎస్)ను తప్పనిసరి చేయాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కేంద్రం కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని 2027, అక్టోబర్ 1 నుంచి అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ (ఏవీఏఎస్)ను తప్పనిసరి చేయాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. 2026, అక్టోబర్ తర్వాత తయారు చేసే అన్ని కొత్త ఎలక్ట్రిక్ ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల మోడళ్లలో ఏవీఏఎస్ అమర్చాలని మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొంది. సాధారణంగా వాహనాలు రోడ్లపై వెళ్లే సమయంలో ఇంజిన్ శబ్దం కారణంగా హారన్ కొట్టకపోయినా గుర్తించడానికి వీలుంటుంది. అయితే, ఈవీల విషయంలో ఇది సాధ్యం కాదు. బ్యాటరీ, మోటార్‌తో పనిచేసే వాహనాలు కావడంతో ఈవీల నుంచి ఎలాంటి శబ్దం వెలువడదు. దానివల్ల వెనుక లేదా, కొన్ని ఇరుకైన వీధుల్లో ఈవీలు వస్తున్నట్టు గుర్తించడం కష్టంగా మారింది. దీనివల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. దీనికి పరిష్కారం అందించే లక్ష్యంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. నిర్దేశించిన తేది నుంచి అన్ని ఈవీలకు ఏవీఏఎస్ తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ఏవీఏఎస్ అమర్చడం వల్ల వాహనాలు వెళ్లే సమయంలో కృత్రిమంగా శబ్దాన్ని విడుదల చేస్తాయి. దీనివల్ల పాదచారులైనా, మరే ఇతర వాహనదారులైనా వాహనం ఉన్నట్టు గుర్తించవచ్చు. ఇలాంటి వ్యవస్థను ఇప్పటికే అమెరికా, జపాన్ సహా కొన్ని యూరోపియన్ దేశాలు అమలు చేస్తున్నాయి.






