- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MSMEs: వ్యాపారులకు రూ. 2.5 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్
ఈ పథకం ద్వారా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా రుణగ్రహీతలు తమ రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఉంటే, సుమారు 90 శాతం రుణ హామీ లభిస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రభావితమైన వ్యాపారాలకు కేంద్రం మద్దతిచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు మద్దతుగా ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ఇవ్వడాన్ని పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పథకం ద్వారా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా రుణగ్రహీతలు తమ రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఉంటే, సుమారు 90 శాతం రుణ హామీ లభిస్తుంది. రూ. 100 కోట్ల వరకు రుణాలు తీసుకున్న వ్యాపర సంస్థలు, ఎంఎస్ఎంఈల తరపున బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. ప్రభుత్వ అనుబంధ సంస్థ నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్‌సీజీటీసీ) ఈ పూచీకత్తు అందిస్తుంది. ఈ పథకానికి ప్రభుత్వమే రూ.17,000 కోట్ల నుంచి రూ.18,000 కోట్ల వరకు సమకూరుస్తుంది. ఇదివరకు కొవిడ్-19 మహమ్మారి సమయంలోనూ కేంద్రం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ ద్వారా వ్యాపార సంస్థలు దెబ్బతినకుండా కాపాడింది. 2020, మేలో కేంద్రం ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ కారణంగా వ్యాపార సంస్థలు, ఎంఎస్ఎంఈలు గడ్డుకాలాన్ని అధిగమించాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.






