- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Electric Vehicles: ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌లకూ సౌండ్ తప్పనిసరి
2026, అక్టోబర్ 1 నుంచి దీన్ని అమలు చేయాలని నిర్ణయిచింది.

దిశ, బిజినెస్ బ్యూరో: గతేడాది ద్వితీయార్థంలో అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ (ఏవీఏఎస్)ను తప్పనిసరి చేయాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. తాజాగా దీన్ని మరింత విస్తరించాలని మంత్రిత్వ శాఖ భావిస్తొంది. కొత్తగా ఈ జాబితాలో ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌లు, ఎమ్(ప్రయాణీకులను తీసుకెళ్లే), ఎన్(సరుకు రవాణా) కేటగిరీలోని అన్ని కొత్త ప్రైవేట్, కమర్షియల్ వాహనాలకు ఈ సౌండ్ సిస్టమ్ ఉండాలనే నిబంధనను అమలు చేయనుంది. 2026, అక్టోబర్ 1 నుంచి దీన్ని అమలు చేయాలని నిర్ణయిచింది. ఇప్పటికే రోడ్లపై ఉన్న వాహనాలకు ఈ నిబంధన 2027, అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని స్పష్టం చేసింది. ఎలాంటి శబ్దాన్ని విడుదల చేయని ఈవీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీలు), హైబ్రిడ్‌లలో అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ (ఏవీఏఎస్) ఒక భద్రతా ఫీచర్‌గా పనిచేస్తుంది. ఇది పాదచారులు, రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలకు మరొక వాహనం వస్తుందనే విషయాన్ని ముందుగానే గుర్తించడానికి వీలవుతుంది. ఇతరులను అప్రమత్తం చేయడానికి వీలుగా ఈ సిస్టమ్ శబ్దం చేస్తుంది.






