Pension Sector: పెన్షన్ రంగంలో 100 శాతానికి ఎఫ్‌డీఐ పరిమితి

by S Gopi |

ప్రస్తుతం పెన్షన్ రంగంలో ఎఫ్‌డీఐలకు 49 శాతం వరకు అవకాశం ఉంది.

Pension Sector: పెన్షన్ రంగంలో 100 శాతానికి ఎఫ్‌డీఐ పరిమితి
X

దిశ, బిజినెస్ బ్యూరో: పెన్షన్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సంబంధిత బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురావాలని చూస్తోంది. గతేడాది పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి సవరించిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో పెన్షన్ రంగంలోనూ విదేశీ పెట్టుబడుల పెంపునకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం పెన్షన్ రంగంలో ఎఫ్‌డీఐలకు 49 శాతం వరకు అవకాశం ఉంది. దీన్ని వంద శాతానికి పెంచాలంటే పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) చట్టం-2013కి సవరణలు చేయాలి. వివిధ ఆమోదాలను బట్టి వర్షాకాల సమావేశాల్లో లేదా శీతాకాల సమావేశాల్లో రావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, సవరణ బిల్లులో పీఎఫ్ఆర్‌డీఏ నుంచి ఎన్‌పీఎస్ ట్రస్ట్‌ను వేరు చేసే అంశం ఉండవచ్చని తెలుస్తోంది. తద్వారా ఎన్‌పీఎస్ ట్రస్ట్ అధికారాలు, విధులను కంపెనీ చట్టం లేదా ఛారిటబుల్ ట్రస్ట్ పరిధిలోకి తీసుకురావడమే కాకుండా 15 మంది సభ్యులతో కూడిన బోర్డు ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

Next Story