IDBI Bank: ఐడీబీఐ బ్యాంకులో ఓఎఫ్‌ఎస్ ద్వారా వాటా విక్రయం

by S Gopi |

దీనికోసం ఆఫర్-ఫర్-సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా వాటాను విక్రయించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

IDBI Bank: ఐడీబీఐ బ్యాంకులో ఓఎఫ్‌ఎస్ ద్వారా వాటా విక్రయం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఎల్ఐసీకి చెందిన ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాను ఉపసంహరించుకునే ప్రయత్నం విఫలమైన తర్వాత, పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికోసం ఆఫర్-ఫర్-సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా వాటాను విక్రయించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో పబ్లిక్ వాటా 5.29 శాతం మాత్రమే ఉంది. కొత్తగా ఓఎఫ్ఎస్ ద్వారా పెంచే వాటా ద్వారా బ్యాంకు వాల్యూయేషన్‌ను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీకి మిగిలిన 49.24 శాతం, భారత ప్రభుత్వ వద్ద 45.48 శాతం ఉంది. అయితే, ఎల్ఐసీ, ప్రభుత్వ వాటా కలిపి 60.74 శాతం వాటా విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానించగా, ఇటీవల తక్కువ రిజర్వ్ ధరతో బిడ్లు రావడంతో వాటా విక్రయ ప్రణాళికను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ క్రమంలో తక్కువ పబ్లిక్ షేర్ హోల్డింగ్ కారణంగా వాల్యూయేషన్ పొందడం కష్టమని ప్రభుత్వం భావిస్తోంది.దీనికోసం వాటా విక్రయించి మెరుగైన మార్కెట్ ప్రైస్ పొందాలని ఆశిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Next Story