- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Piyush Goyal: రూపాయి విలువపై ప్రభుత్వం జోక్యం చేసుకోదు
రూపాయి విలువను ప్రభుత్వం నిర్ణయించదని, అది పూర్తిగా మార్కెట్ శక్తులు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. రూపాయి ఎక్స్ఛేంజ్ రేట్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని తెలిపారు. రూపాయి విలువను ప్రభుత్వం నిర్ణయించదని, అది పూర్తిగా మార్కెట్ శక్తులు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నారు. గత రెండు మూడు రోజులుగా రూపాయి మళ్లీ బలపడిందని పేర్కొన్న ఆయన, ఇవన్నీ మార్కెట్ ఆధారిత మార్పులేనని స్పష్టం చేశారు. ముడి చమురు ధరలు తగ్గడం, అలాగే ఆర్‌బీఐ జోక్యం కారణంగా రూపాయి ఇటీవల అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూ. 95.60 స్థాయికి పుంజుకుంది. అయితే, ఈ ఏడాది రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహాల్లో మార్పులు, పెరుగుతున్న వాణిజ్య లోటు, బలపడుతున్న అమెరికన్ డాలర్ ప్రభావంతో రూపాయి ఇతర కరెన్సీల కంటే బలహీనంగా మారింది. ఈ నేపథ్యంలో ఎగుమతులను పెంచడం, దిగుమతులపై ఆధార పడటాన్ని తగ్గించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.






