- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UPI Payments: రూ. 3 వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు
ఇదే నిజమైతే 2020, జనవరి తర్వాత అమల్లోకి తెచ్చిన జీరో ఎండీఆర్ పాలసీకి గుడ్‌బై చెప్పినట్టే.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపులు, లావాదేవీలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు యూపీఐ లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు లేవు. అయితే, ఎక్కువ మొత్తం డిజిటల్ లావాదేవీలను నిర్వహించడంలో ఖర్చులు పెరుగుతున్నాయని, బ్యాంకులతో పాటు పేమెంట్ సర్వీసెస్ సంస్థలు చెబుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు డిజిటల్ లావాదేవీలపై మర్చంట్ ఛార్జీలను అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. వ్యాపారులకు పొందే వార్షిక ఆదాయంతో సంబంధం లేకుండా లావాదేవీల విలువ ఆధారంగా మర్చంట్ డిస్కౌంట్ ఛార్జీ(ఎండీఆర్)లను విధించాలనే చర్చ జరుగుతోంది. యూపీఐ ద్వారా రూ. 3,000 దాటిన లావాదేవీలపై ఈ ఛార్జీలు అమలు చేయవచ్చు. ఇదే నిజమైతే 2020, జనవరి తర్వాత అమల్లోకి తెచ్చిన జీరో ఎండీఆర్ పాలసీకి గుడ్‌బై చెప్పినట్టే. చిన్న మొత్తం లావాదేవీలపై ఎలాంటి ఎండీఆర్ ఛార్జీలు ఉండకపోవచ్చు. దీనిపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఎన్‌పీసీఐలతో చర్చించిన తర్వాత మరో 2 నెలల్లో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రూపే కార్డులపై ఎండీఆర్ అమలు చేయకపోవచ్చు.
యూజర్లపై ఎఫెక్ట్
ఎండీఆర్ ఛార్జీల ఎఫెక్ట్ సాధారణ యూజర్లపై ఉంటుందనే దాని గురించి స్పష్టత లేదు. ఈ ఛార్జీలను వ్యాపారుల నుంచి వసూలు చేస్తారు కాబట్టి ఎండీఆర్ ఛార్జీలను అమలు చేసినప్పటికీ యూజర్లపై ప్రభావం ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఎక్కువ మొత్తాలకు సంబంధించి పెద్ద వ్యాపారులపై 0.3 శాతం విధించేందుకు పేమెంట్స్ కౌన్సిల్ ప్రతిపాదించింది. ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులపై 2 శాతం వరకు ఎండీఆర్ ఛార్జీలను విధిస్తున్నారు.






