- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bank Strike: ఆ రోజు బ్యాంకు ఉద్యోగుల సమ్మే.. కారణం ఏంటంటే?
Bank Strike in March : ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: Bank Strike in March : ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. వారానికి ఐదురోజుల పని, అన్ని విభాగాల్లో ఉద్యోగ నియామకాలతోపాటు ఇతర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మార్చి 24 నుంచి రెండురోజులపాటు సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మెలో 9 బ్యాంకింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉద్యోగులు పాల్గొంటున్నారని యూఎఫ్ బీయూ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఇన్సెంటీవ్స్ ఇచ్చే ప్రతిపాదనను డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచనలను వెంటనే విరమించుకోవాలని..దీంతో ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిళ్లనున్నదని..అలాగే సిబ్బంది మధ్య విభజనకు దారితీసే ప్రమాదం ఉందని యూఎఫ్ బీయూ డిమాండ్ చేస్తున్నది. ప్రభుత్వంతో, బ్యాంకు యాజమాన్యంతో చర్చలు విఫలమైతే, ఈ సమ్మె కారణంగా ప్రజల సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఇది చెక్కు క్లియరెన్స్, నగదు ఉపసంహరణ, డిపాజిట్లు, రుణ ఆమోదం, ఆన్‌లైన్ లావాదేవీల వంటి సేవలను ప్రభావితం చేయవచ్చు.
బ్యాంకుల విధానపరమైన విషయాలలో ప్రభుత్వం మితిమీరిన జోక్యం బ్యాంకుల స్వయంప్రతిపత్తిని ప్రభావితం చేస్తోందని.. ఉద్యోగుల హక్కులను ఉల్లంఘిస్తున్నారని UFBU పేర్కొంది. దీనికి నిరసనగా సమ్మెకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లను తగిన విధంగా పరిశీలించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని యూనియన్లు చెబుతున్నాయి.నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ మరియు ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ UFBU సభ్యులుగా ఉన్నాయి.






