1.2 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం

by Web Desk |
1.2 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: బొగ్గు ఉత్పత్తిని 2023-24 నాటికి 1.2 బిలియన్లకు పెంచాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం ఆదాయ వాటా విధానం, రోలింగ్ వేలం, సింగిల్ విండో క్లియరెన్స్‌తో సహా అనేక ప్రోత్సహాకాలను అమలు చేసిందని కేంద్ర బొగ్గు మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం తెలిపారు. "కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) గనుల నుండి ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని ఆశించామని" జోషి లోక్‌సభలో ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో తెలిపారు. బొగ్గు ఉత్పత్తి సామర్ద్యాన్ని పెంపొందించడానికి కోల్ ఇండియా లిమిటెడ్ అనేక చర్యలు తీసుకుంది. మైన్ డెవలపర్ కమ్ ఆపరేటర్ మోడ్ ద్వారా నిర్వహించబడే సుమారు 160 MTPA (సంవత్సరానికి మిలియన్ టన్నులు) సామర్థ్యం కలిగిన 15 ప్రాజెక్ట్‌లను CIL గుర్తించింది. 'ఫస్ట్ మైల్ కనెక్టివిటీ' ప్రాజెక్టుల కింద మెకనైజ్డ్ బొగ్గు రవాణా, లోడింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడానికి CIL చర్యలు చేపట్టింది. బొగ్గు గనుల కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు బొగ్గు రంగం కోసం కేంద్ర ప్రభుత్వం సింగిల్ విండో క్లియరెన్స్ పోర్టల్‌ను ప్రారంభించింది.


Next Story

Most Viewed