Insurance Sector: బీమా కంపెనీలలో 100 శాతం ఎఫ్‌డీఐ నోటిఫై చేసిన కేంద్రం

by S Gopi |

ఇదే సమయంలో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ విషయంలో ఎఫ్‌డీఐల పరిమితికి మినహాయింపు ఇచ్చింది.

Insurance Sector: బీమా కంపెనీలలో 100 శాతం ఎఫ్‌డీఐ నోటిఫై చేసిన కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భారత బీమా రంగంలో కీలక సంస్కరణ 100 శాతం ఎఫ్‌డీఐ పరిమితికి అనుమతులిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల విదేశీ పెట్టుబడిదారులకు మరిన్ని అవకాశాలు, దేశీయ బీమా రంగంలో పెట్టుబడులు, పోటీ, ఆవిష్కరణలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ విషయంలో ఎఫ్‌డీఐల పరిమితికి మినహాయింపు ఇచ్చింది. ఎల్ఐసీలోకి గరిష్ఠంగా 20 శాతం వరకు మాత్రమే ఎఫ్‌డీఐలు అనుమతించనున్నట్టు స్పష్టం చేసింది. అయితే, విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలు మన బీమా రంగంలో దేశీయ భాగస్వామి లేకుండా 100 శాతం పెట్టుబడి పెట్టొచ్చు. విదేశీ పెట్టుబడులు బీమా చట్టం-1938, ఇతర సంబంధిత నిబంధనలకు లోబడి ఉండాలి. అలాగే, ఏ కంపెనీ అయినా బీమా వ్యాపారం చేయాలంటే, నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ నుంచి తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి. అంతేకాకుండా, విదేశీ పెట్టుబడులు ఉన్న కంపెనీల్లోని కీలక పదవుల్లో కనీసం ఒకరు భారతీయ పౌరుడిగా ఉండాలనే షరతును కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.

Next Story