Customs Duty: పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించిన ప్రభుత్వం

by S Gopi |

ప్రధానంగా వీటి ధరలు పెరిగితే, ప్రజలపై భారం పడుతుందనే కారణంతో ప్రభుత్వం పరిష్కార నిర్ణయం తీసుకుంది.

Customs Duty: పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించిన ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ సరఫరాలో అంతరాయాలు పెరుగుతున్న నేపథ్యంలో పెట్రోకెమికల్ ముడిసరుకులపై ఆధారపడిన పరిశ్రమలకు కేంద్రం తాత్కాలిక ఉపశమన చర్యలను ప్రకటించింది. ప్రధానంగా వీటి ధరలు పెరిగితే, ప్రజలపై భారం పడుతుందనే కారణంతో ప్రభుత్వం పరిష్కార నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కీలక పెట్రోకెమికల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని మినహాయించింది. ఈ నిర్ణయం గురువారం(ఏప్రిల్ 2) నుంచి జూన్ 30 వరకు పరిమిత కాలం వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా పరిశ్రమలకు ముఖ్యమైన పెట్రోకెమికల్ ముడిసరుకు లభ్యత, సరఫరాకు ఇబ్బందుల్లేకుండా, వీటిపై ఆధారపడిన రంగాలకు ఖర్చుల భారం తగ్గించాలని భావిస్తున్నాం. దీనివల్ల కీలక ఫార్మా, ఆటో, టెక్స్‌టైల్స్, ప్లాస్టిక్, కెమికల్ రంగాలకు ప్రయోజనం కలుగుతుంది. సుంకం మినహాయింపు ఇచ్చిన పెట్రోకెమికల్స్‌లో మిథనాల్‌, వినైల్‌ క్లోరైడ్‌ మోనోమర్‌, అన్‌శాచురేటెడ్‌ పాలిస్టర్‌ రెసిన్స్‌, అన్‌హైడ్రస్‌ అమోనియా, స్టీరేన్‌ బ్యుటడిన్‌, డైక్లోరోమిథేన్‌, పాలీ బ్యూటడిన్‌ ఉన్నాయి. పాలిఇథిలీన్, పాలిప్రొపిలీన్, పాలిస్టైరీన్, పాలివినైల్ క్లోరైడ్, పాలిఇథిలీన్ టెరెఫ్తలేట్ చిప్స్ వంటి పాలిమర్లు ఉన్నాయి.

Next Story