Google Best App: ఉత్తమ యాప్ జాబితాలో జొమాటో డిస్ట్రిక్ట్ అగ్రస్థానం

by S Gopi |   (  Updated:2025-11-19 17:23:05  IST  )

ఉత్తమ యాప్‌గా జొమాటోకు చెందిన డిస్ట్రిక్ట్(సినిమా, ఈవెంట్, డైనింగ్ యాప్) అగ్రస్థానం సొంతం చేసుకుంది.

Google Best App: ఉత్తమ యాప్ జాబితాలో జొమాటో డిస్ట్రిక్ట్ అగ్రస్థానం
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాదికి సంబంధించి ఉత్తమ యాప్స్ జాబితాను విడుదల చేసింది. దేశంలో 2025 ఏడాదికి అత్యంత ఆదరణ కలిగిన ప్లేస్టోర్ యాప్స్, గేమ్స్ జాబితాను బుధవారం ప్రకటించింది. ఉత్తమ యాప్‌గా ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు చెందిన డిస్ట్రిక్ట్(సినిమా, ఈవెంట్, డైనింగ్ యాప్) అగ్రస్థానం సొంతం చేసుకుంది. టాప్ ట్రెండింగ్ యాప్ విభాగంలో 10 నిమిషాల గ్రాసరీ డెలివరీ యాప్ 'ఇన్‌స్టామార్ట్' తొలిస్థానంలో ఉండగా, గేమింగ్ విభాగంలో కుకీ రన్ ఇండియా(రన్నింగ్ గేమ్) ఉత్తం గేమ్‌గా నిలిచింది. ఇక, గూగుల్ వెల్లడించిన వివరాల ప్రకారం, బెస్ట్ హిడెన్‌జెమ్ యాప్‌గా టూన్‌సూత్రా నిలవగా, ఎవ్రీడే ఎసెన్షియల్ యాప్‌గా డైలీ ప్లానర్, ఉత్తమ ఫున్ యాప్‌గా ఇన్‌స్టాగ్రామ్‌కు చెందిన ఎడిట్స్ వంటి యాప్‌లు జాబితాలో ఉన్నాయి. టాప్ ట్రెండింగ్ విభాగంలో ఇన్‌స్టామార్ట్ తర్వాత లెర్నింగ్ యాప్ సీఖో, ఏఐ జనరేటర్ అడోబ్ ఫైర్‌ఫ్లై ఉన్నాయి. యూజర్ల ఇష్టాయిష్టాలు, స్థానిక సంస్కృతికి అనుగుణంగా ఉన్న యాప్స్‌ను ఎక్కువమంది ఇష్టపడుతున్నారని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

Next Story