- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Google: జెమిని ఏఐ, గూగుల్ వన్ ధరలను సగానికి తగ్గించిన గూగుల్
15 జనవరి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ప్రకటనలో వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ తమ ప్రీమియం ఏఐ, క్లౌడ్ స్టోరేజీ సేవలపై భారీ తగ్గింపును ప్రకటించింది. పరిమిత కాలానికి వార్షిక సబ్‌స్క్రిప్షన్‌లపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు తాజా ప్రకటనలో వెల్లడించింది. జనరేటివ్ ఏఐ మార్కెట్లో ఆధిపత్యం కోసం పోటీ పెరుగుతున్న నేఫథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. తాజా ఆఫర్ గూగుల్ ఏఐ ప్రో, ప్రీమియం గూగుల్ వన్ ఎంచుకునే కొత్త సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా 2026, 15 జనవరి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, ఆ తర్వాత కస్టమర్లు రెన్యూవల్‌ను మాన్యువల్‌గా నిలిపివేస్తే తప్ప, సబ్‌స్క్రిప్షన్ సాధారణ ధరలకు ఆటోమెటిక్‌గా యాక్టివ్ అవుతుంది.
అయితే, ప్రస్తుతానికి ఈ ఆఫర్‌ను క్రిస్మస్ సందర్భంగా అమెరికాలో మాత్రమే అందిస్తున్నట్టు తెలుస్తోంది. భారత మార్కెట్‌లో అందుబాటులో లేదు. సాధారణంగా గూగుల్ మనదేశంలో పండుగల సీజన్ ఆధారంగా ఆఫర్లు ప్రకటిస్తుంది. కాబట్టి ఈ ఆఫర్ నూతన సంవత్సరం లేదా రాబోయే పండుగలకు డిస్కౌంట్ ఆఫర్లను అందించే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోతో భాగస్వామ్యం ద్వారా జియో యూజర్లకు ఉచితంగా జెమిని ఏఐ లభిస్తోంది. గూగుల్ వన్ మాత్రం ఏడాదికి స్టోరేజ్‌ను బట్టి రూ. 589 నుంచి రూ. 16,000 ఫీజుతో అందుబాటులో ఉంది. తాజా ఆఫర్ కింద జెమిని ఏఐ ప్రస్తుతం అమెరికాలో ఏడాదికి ధర సుమారు 199.99 డాలర్లు(మన కరెన్సీలో సుమారు రూ. 17,950) నుంచి 99.99 డాలర్ల (సుమారు రూ. 8,975)కి తగ్గుతుంది. కానీ, ఆ తర్వాత ఏడాది నుంచి ఇది 239.88 డాలర్లు (సుమారు రూ. 21,530) అవుతుంది. అధిక ధరతో సబ్‌స్క్రిప్షన్ వద్దనుకునే కస్టమర్లు ఏడాది తర్వాత ఆటో-రెన్యూవల్ ఫీచర్‌ను నిలిపేయాల్సి ఉంటుంది.






