- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Google: ఏఐ ప్రాజెక్టులలోని 200 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిన గూగుల్
లేఆఫ్‌కు గురైన వారు జెమిని, ఏఐ టూల్స్ ప్రాజెక్టులలో ఉన్నవారే

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌లో తొలగింపులు కొనసాగుతున్నాయి. వరుసగా గత మూడు నెలలుగా వివిధ విభాగాల్లో లేఆఫ్స్ ప్రకటించిన గూగుల్, తాజాగా 200 మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది. లేఆఫ్‌కు గురైన వారు జెమిని, ఏఐ టూల్స్ ప్రాజెక్టులలో ఉన్నవారే కావడం గమనార్హం. అయితే, ఎలాంటి సమాచారం లేకుండా, ముందస్తు హెచ్చరిక ఇవ్వకుండానే తమను ఉద్యోగాల నుంచి తొలగంచారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో గూగుల్‌లో ఉద్యోగ భద్రత, తక్కువ జీతం, యూనియన్ ప్రయత్నాలకు ప్రతీకారం తీర్చుకునే ధోరణిలో ఈ లేఆఫ్ ప్రక్రియ జరుగుతోందనే ఆందోళనలను పెరిగాయి. ముఖ్యంగా ఏఐ లాంటి అధునాతన టెక్నాలజీలో పురోగతి సాధించే ప్రాజెక్టులపై ఈ ఉద్యోగులను పనిచేస్తున్నారు. అయితే, తొలగించిన ఉద్యోగులకు నేరుగా గూగుల్‌తో సంబంధాలు లేవని, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ, సబ్-క్రాంట్రాక్ పద్దతిలో ఉన్న ఉద్యోగులని కంపెనీ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.






