గుడ్ న్యూస్ చెప్పిన ఫిప్ల్ కార్ట్.. 5 వేల ఉద్యోగాలు ఆఫర్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-27 05:59:59  IST  )

వాల్‌మార్టుకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఈ ఏడాదిలో 5 వేల మందిని కొత్తగా నియమించుకునేందుకు సిద్ధమైంది.

గుడ్ న్యూస్ చెప్పిన ఫిప్ల్ కార్ట్.. 5 వేల ఉద్యోగాలు ఆఫర్
X

దిశ, వెబ్ డెస్క్: వాల్‌మార్టుకు (Wallmart) చెందిన ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) భారత మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకొనేందుకు వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. ఈ ఏడాది 5 వేల మందిని కొత్తగా నియమించుకునేందుకు సిద్ధమైంది. సంస్థ తీసుకొచ్చిన క్విక్ కామర్స్ సేవలు మినిట్స్‌, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్స్‌ జరిపేందుకు సూపర్‌.మనీ (Super.money) అప్లికేషన్‌పై దృష్టి సారించింది. ఈ విభాగాల్లో డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీ, సప్లై చైన్‌, కస్టమర్‌ సపోర్ట్‌ వంటి విభాగాల్లో నియామకాలు జరగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా కంపెనీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఫ్లిప్‌కార్ట్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ సీమా నాయర్‌ ఈ నియామక ప్రణాళికలను ప్రకటించారు.

ఇక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రంగంలో ఫ్లిప్‌కార్ట్‌ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ ఏడాదిలో ఏఐపై పెట్టుబడులు ఆరు రెట్లు పెరిగాయి. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపర్చడం, ఆర్డర్‌ ప్రక్రియను వేగవంతం చేయడం, మినిమమ్‌ ఎర్రర్లు ఉండేలా వ్యవస్థను ఆటోమేట్‌ చేయడం లక్ష్యంగా ఏఐ టెక్నాలజీని ప్రవేశపెడుతోంది. తద్వారా సంస్థ తన పోటీదారుల కంటే ముందుండేందుకు కృషి చేస్తోంది. మరోవైపు పబ్లిక్‌ ఇష్యూ (IPO) కోసం సిద్ధమవుతున్న ఫ్లిప్‌కార్ట్‌ తన హోల్డింగ్‌ కంపెనీని సింగపూర్‌ నుంచి భారత్‌కు తరలించాలని భావిస్తోంది. ఇకపోతే, దేశవ్యాప్తంగా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా ఫ్లిప్‌కార్ట్‌ ఒక సామాజిక బాధ్యతను కూడా నిర్వహిస్తోంది.

Next Story