- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GoldRate: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన ధరలు
బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. జాతీయ, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో గత 8 రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు ఎట్టకేలకు మంగళవారం బ్రేక్ పడింది.

దిశ, వెబ్ డెస్క్: బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. జాతీయ, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో గత 8 రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు ఎట్టకేలకు మంగళవారం బ్రేక్ పడింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 320 రూపాయలు తగ్గి రూ.81,930 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 300 రూపాయలు తగ్గి 75,100గా ఉంది. ఇక కేజీ వెండి ధర దేశవ్యాప్తంగా 1000 రూపాయల మేర తగ్గింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.
* ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,390 వద్ద ఉంది.
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.75,390 ఉండగా, 24 క్యారెట్లకు రూ.82,240 వద్ద ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.75,390 ఉండగా, 24 క్యారెట్లకు రూ.82,240 ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.75,390 ఉండగా, 24 క్యారెట్లకు రూ.82,240 వద్ద ఉంది.
* చెన్నైలో 22 క్యారెట్లకు రూ.75,390 ఉండగా, 24 క్యారెట్లకు రూ.82,240 వద్ద ఉంది.
* ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,240 వద్ద ఉంది.
అయితే, ఈ ధరలు ఉదయం 6 గంటల సమయంలో నమోదైనవి మాత్రమే. బంగారం ధరలు ఎల్లప్పుడూ మారుతూ ఉంటాయి. రోజులో ఎప్పుడైనా పెరగవచ్చు, తగ్గవచ్చు, లేదా స్థిరంగా కొనసాగవచ్చు.






