- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేద, మధ్యతరగతి ప్రజలకు తీపికబురు.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా పతనమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: కొనబోతే కొరివి అన్నట్లుగా ఇన్నాళ్లు పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు గత వారం రోజులుగా దిగి వస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ మరోసారి పసిడి, వెండి ధరలు ఊహించని విధంగా పతనమయ్యాయి. ఒకేరోజు వేలల్లో ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో సామాన్యులకు పెద్ద ఊరటనిస్తోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర నేడు ఏకంగా రూ.5,950 తగ్గి ప్రస్తుతం రూ.1,40,020 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.5,450 పతనమై, రూ.1,28,350కు చేరింది.
మరోవైపు కేజీ వెండిపై ఏకంగా రూ.20 వేలు తగ్గి, ప్రస్తుతం రూ.2,30,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాల కారణంగానే దేశీయ మార్కెట్‌లో ఈ స్థాయిలో ధరలు తగ్గినట్లుగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తాజా పరిణామంతో నగల దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడే అవకాశం ఉంది.






