- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Govt Scheme: మీకు కష్టంగా ఉందా? డబ్బులు లేవా? ఈ పథకాలు మీకు హెల్ప్ అవుతాయి!
Govt Scheme: మనం జీవితం చాలా సందర్భాల్లో రిస్క్ లోనే ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: Govt Scheme: మనం జీవితం చాలా సందర్భాల్లో రిస్క్ లోనే ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియదు. మనం చేసేంత వరకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి. ఆర్థికంగా బలంగా ఉన్నవారు పలు ఫైనాన్షియల్ ఇన్ స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్ సెక్యూర్ గా ఉంచుకుంటారు. అయితే తక్కువ ఆదాయం ఉన్నవారు మాత్రం ఇందులో మరింత వెనబడి ఉంటారు. తక్కువ ఆదాయం సంపాదించే వారి భవిష్యత్తును రక్షించేందుకు ప్రభుత్వం చాలా స్కీములను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రధానంగా పోస్టాఫీస్ జన్ సురక్ష స్కీమ్ అమలు చేస్తోంది. ఇందులో మూడు ఆఫర్డబుల్ స్కీమ్స్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన. ఈ స్కీమ్స్ కష్టసమయాల్లో భద్రతను అందిస్తాయి. తక్కువ ప్రీమియంతో అందరికీ అందుబాటులో ఉంటాయి.
అటల్ పెన్షన్ అనేది వ్రుద్ధ్యాప్యంలో ఫిక్స్డ్ ఇన్ కమ్ అందించే పెన్షన్ స్కీమ్. ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికులకు ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఎంత పెట్టుబడి పెట్టారనే దానిపై ఆధారపడి ఉటుంది. 60 సంవత్సరాల వయస్సు తర్వాత రూ. 1000 నుంచి రూ. 5,000 వరకు నెలలవారీ పెన్షన్ పొందవచ్చు.
ప్రీమియం మీ వయస్సు ఎంచుకున్న పెన్షన్ డబ్బుపై ఆధారపడి ఉంటుంది. యువకులు తక్కువ ప్రీమియంలు చెల్లిస్తారు. ఊదాహరణకు 20ఏళ్ల వ్యక్తి రూ. 5,000 పెన్షన్ కోసం రూ. 50 నుంచి 200 వరకు చెల్లిస్తే సరిపోతుంది. పన్ను చెల్లింపుదారులు కానీ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ అకౌంట్ ఉన్న 18 నుంచి 40 ఏళ్ల వయస్సుకన్న భారతీయ పౌరులకు అందుబాటులో ఉంటుంది. 60ఏళ్ల వయస్సు వరకు కాంట్రిబ్యూట్ చేయాలి. కాంట్రిబ్యూషన్స్ మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ ఆటో డెబిట్ అవుతాయి. 60ఏళ్ల తర్వాత పెన్షన్ కూడా లభిస్తుంది. మీరు మరణించినట్లయితే మీ జీవిత భాగస్వామికి పెన్షన్ అందుతుంది. ఇద్దరు మరణిస్తే నామినీకి అమౌంట్ అందుతుంది.
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది మీరు అనుకోకుండా మరణించినట్లయితే మీ కుటుంబానికి భద్రతను అందించే లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. పాలసీదారుడు మరణిస్తే..కుటుంబం అవసరాలు తీర్చడానికి రూ. 2లక్షల వరకు లభిస్తుంది. ప్రీమియం ఏడాదికి రూ. 436మాత్రమే. అంటే నెలకు దాదాపు రూ. 36 చెల్లించాల్సి ఉంటుంది. సేవింగ్స్ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ అకౌంట్ఉన్న 18 ఏళ్ల నుంచి 50ఏళ్లవయస్సు గల ఎవరైనా ఇందులో చేరవచ్చు. ప్రీమియంలు చెల్లిస్తూ ఉంటే కవరేజ్ 55ఏళ్లవయస్సు గల వరకు కొనసాగుతుంది. ప్రీమియం ప్రతి ఏడాది మీబ్యాంక్ లేదా పోస్టాఫీస్ అకౌంట్ నుంచి అటోమెటిగ్గా డెబిట్ అవుతుంది. మీరుబ్యాంకులు, పోస్టాఫీస్ లు లేదా ఆన్ లైన్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది కాస్ట్లీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ని భరించలేని వారి కోసం రూపొందించిన యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్. 2015లో అందుబాటులోకి వచ్చిన ఈ స్కీమ్ చాలా తక్కువ ధరకే కవరేజీని అందిస్తుంది. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత పూర్తి వైకల్యం సంభవిస్తే కుటుంబానికి రూ. 2లక్షలు అందుతుంది. పాక్షిక శాశ్వత వైకల్యానికి రూ. 1లక్షల పరిహారం లభిస్తుంది.
ప్రీమియం ఏడాదికి కేవలం రూ. 20 మాత్రమే చెల్లించాలి. తక్కువ ఆదాయ కుటుంబాలు కూడా చాలా సులభంగా చెల్చింవచ్చు. బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతా ఉన్న 18 నుంచి 70 ఏళ్ల వయస్సు గల వ్యక్తులకు అందుబాటులో ఉంటుంది. ప్రీమియం ప్రతి సంవత్సరం ఆటో డెబిట్ అవుతుంది. కవరేజ్ ప్రతి ఏడాది జూన్ 1 నుంచి మే 31 వరకు నడుస్తుంది. బ్యాంకులు లేదా అన్ లైన్ పోర్టల్ ద్వారా క్లెయిమ్స్ దాఖలు చేసుకోవచ్చు. వ్యక్తికి 70ఏళ్లు వచ్చే వరకు ఈస్కీమ్ ముగుస్తుంది.






