- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్మార్ట్ఫోన్ ప్రియులకు శుభవార్త.. ఇకపై అన్ని ఆఫర్స్ !
ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ వినియోగం విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. అసలు మొబైల్ ఫోన్ లేకపోతే.. ఒక్క పని కూడా జరగడం

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ వినియోగం విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. అసలు మొబైల్ ఫోన్ లేకపోతే.. ఒక్క పని కూడా జరగడం లేదు. గుమస్తా నుంచి మొదలుకొని ఉన్నత శ్రేణి ఉద్యోగం వరకు.. కచ్చితంగా ఫోన్ ఉండాల్సిందే. అలాగే... జియో వచ్చినప్పటి నుంచి స్మార్ట్ ఫోన్లు వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది.
దీనికి తగ్గట్టుగానే.. రకరకాల మోడల్స్ లో... తక్కువ ధరకే మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. అయితే... రెండు తెలుగు రాష్ట్రాలలో వరుసగా త్వరలోనే వరుసగా పండుగలు రాబోతున్నాయి. రక్షాబంధన్, వినాయక చవితి, దసరా, దీపావళి వరకు అన్ని పండుగలే. పండుగ వచ్చిందంటే చాలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు... అనేక రకాల ఆఫర్లు ప్రకటిస్తాయి. ఇక ఈ సంవత్సరం కూడా.. స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఆఫర్లు ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ మేరకు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరున్ కూడా అధికారిక ప్రకటన చేశారు. ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లో సేల్స్ పడిపోవడం కారణంగా.. ఆగస్టు నుంచి.. ఆఫర్లు పెట్టబోతున్నారట. ఆరు నెలల పాత స్టాక్ ను క్లియర్ చేయాలని అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు భావిస్తున్నాయట. ఇందులో భాగంగానే 25 శాతం నుంచి 50% వరకు డిస్కౌంట్లు కూడా ఇచ్చే ఛాన్స్ లు ఉన్నాయట.






