జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఆఫర్‌ ప్లాన్ల పొడిగింపు

by Yella Dhawani Reddy |

జియో యూజర్లకు రిలయన్స్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఆఫర్‌ ప్లాన్ల పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: జియో (Jio) యూజర్లకు రిలయన్స్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ సందర్భంగా జియో హాట్‌స్టార్ (Jio Hotstar) సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన పలు ప్రత్యేక ప్లాన్లను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఆఫర్ల గడువును ప్రస్తుతం పొడిగించింది. ముందు ప్రకటించిన గడువు ప్రకారం ఈ స్పెషల్ ప్లాన్లను రీఛార్జ్ చేసుకునేందుకు మార్చి 31 వరకు అవకాశం ఉండేది. అయితే ఈ ఐపీఎల్ టోర్నమెంట్‌కు లభిస్తున్న ఆదరణ దృష్ట్యా ఈ ఆఫర్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తూ జియో నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న యూజర్లు 4కే రిజల్యూషన్‌లో టీవీ, మొబైల్ రెండింటిలోనూ ఐపీఎల్‌ను ఉచితంగా వీక్షించవచ్చు.

ఫ్రీ జియో హాట్‌స్టార్‌ ప్లాన్లు ఇవే..

* రూ.100 ప్లాన్‌‌తో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీతో 5జీబీ డేటా, జియో హాట్‌స్టార్‌ యాక్సెస్‌ లభిస్తుంది. అయితే, ఈ ప్లాన్‌లో కాల్స్, మెసేజెస్ వర్తించవు.

* రూ.195తో రీఛార్జ్ చేసుకుంటే.. 15జీబీ డేటా, 90 రోజులపాటు జియో హాట్‌స్టార్‌ యాక్సెస్‌ లభిస్తుంది. ఇందులో కూడా కాల్స్, మెసేజెస్ వర్తించవు.

* రూ.949 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. 84 రోజుల వ్యాలిడిటీతో జియో హాట్‌స్టార్‌తో పాటు ప్రతిరోజూ 2జీబీ, రోజుకు 100 SMSలు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 5జీ ప్రయోజనాలు ఉంటాయి. అదనంగా జియోక్లౌడ్‌, ఓటీటీ, ఇతర టెలికమ్‌ బెనిఫిట్లు ఆనందించవచ్చు.

Next Story