- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పసిడి ప్రియులకు శుభవార్త.. 5 రోజుల్లో ధర రూ.10 వేలకు పైగా పతనం
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మరోసారి బంగారం ధరలు పతనమయ్యాయి. కేవలం ఐదు రోజుల్లోనే రూ.10,980 మేర ధర తగ్గడంతో సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పసిడి ప్రియులకు వరుసగా ఐదో రోజు కూడా ఊరట లభించింది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ (Hyderabad Bullion Market)లో బంగారం, వెండి ధరలు నేడు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. కేవలం 5 రోజుల వ్యవధిలోనే తులం బంగారం ధర సుమారు రూ.10,980 మేర తగ్గడం విశేషం. ఇవాళ 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలి బంగారం 10 గ్రాముల ధర నిన్నటితో పోలిస్తే రూ.770 తగ్గి, ప్రస్తుతం రూ.1,62,110 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.700 పతనమై రూ.1,48,600కు చేరింది. ఇక బంగారం బాటలోనే వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
హైదరాబాద్ (Hyderabad)తో పాటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా ఇవే ధరలు దాదాపుగా అమల్లో ఉన్నాయి. వరుసగా ఐదు రోజులుగా ధరలు పడిపోతుండటంతో సామాన్య వినియోగదారులు, వివాహ శుభకార్యాల కోసం బంగారం కొనేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందా లేదా అనేది అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.






