- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోలీకి ముందే డీఏ పెంపు ప్రకటన.. ఎంత పెరుగుతుందటే?
DA Hike 2025: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే శుభవార్త వినబోతున్నారా?

దిశ, వెబ్‌డెస్క్: DA Hike 2025: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే శుభవార్త వినబోతున్నారా? హోలీకి ముందే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు(DA Hike)పై కేంద్రం ప్రకటన చేయనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈసారి 20శాతం డీఏ హైక్ ( DA Hike 2025)ఉండవచ్చని తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం.
కరవు భత్యం( Dearness Allowance) డియర్ నెస్ రిలీఫ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హోలీకి ముందే డీఏ పెంపు(DA Hike)పై కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈసారి డీఏ(DA Hike) 2శాతం వరకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న ధరలతో పోరాడేందుకు సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల(Central government employees)కు ఏడాదికి రెండుసార్లు కరువు భత్యం పెంచుతుంది.
అయితే జనవరిలో పెరగాల్సిన డీఏ(DA Hike) గురించి సాధారణంగా మార్చిలో, జులైలో పెరగాల్సిన దాని గురించి దీపావళి సమయంలో కేంద్రం ప్రకటనలు చేస్తూ ఉంటుంది. డీఏ పెంపు(DA Hike) ప్రకటన ఎప్పుడు చేసినా అది జనవరి, జులై నుంచి కలుపుకునే ఉద్యోగుల జీతాల్లో జమ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి 2025 హోలీ సమయంలో డీఏ పెంపుపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని..దీనితో దేశంలోని 1.2కోట్ల మంది ఉద్యోగులు పించనుధారలుకు లబ్దిచేకూరుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
గత ఏడాది రెండుసార్లు డీఏ పెంపు(DA Hike)నకు కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. ఫలితంగా మార్చిలో డీఏ 46శాతం నుంచి 50శాతానికి అక్టోబర్ 50శాతం నుంచి 53శాతానికి పెరిగింది. ఇప్పుడు వస్తున్న వార్తలు నిజం అయినట్లయితే ఈసారి డీఏ(DA Hike) 2శాతం పెరిగే అవకాశం ఉంది. అంటే 53శాతం నుంచి 55శాతానికి పెరుగుతుందన్న మాట.
అయితే ఈ 2025 మార్చి 5న కేంద్ర కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు(DA Hike)పై ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం. కానీ హోలీ సమయానికి ఈ విషయంపై స్పష్టత వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉద్యోగుల కోసం 7వ పే కమిషన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో మార్పులు చేసేందుకు 8వ పే కమిషన్(8th Pay Commission) తీసుకురావాలని చాలా ఏళ్లుగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై 2025 జనవరిలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు(Salaries of government employees), అలవెన్సులు, పెన్షన్లను రివ్యూ చేసేందుకు 8వ పే కమిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఉద్యోగుల జీతాలు, ఫించనుదారుల పెన్షన్లు పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై నివేదిక బయటకు వచ్చేందుకు ఇంకా చాలా నెలల సమయం పడుతుందని 2026 జనవరిలో 8వ పే కమిషన్ అమల్లోకి వస్తుందని ఊహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.






