- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ (Airtel) తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ (Airtel) తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఏఐ సంస్థ పర్‌ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI)తో భాగస్వామ్యం చేసుకుని తన 36 కోట్ల మంది వినియోగదారులకు రూ.17,000 విలువైన Perplexity Pro ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది.అంటే.. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు సంవత్సరం పాటు పర్‌ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందుకోవచ్చు.
భారత్‌లో ఇదే తొలి పెద్దస్థాయి జనరేటివ్ ఏఐ భాగస్వామ్యంగా నిలిచిందని ఎయిర్‌టెల్ ఎండీ గోపాల్ విట్టల్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలకు అత్యాధునిక ఏఐ టెక్నాలజీని అందించాలన్న ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం, డిజిటల్ ఇండియా దిశగా ముందడుగు వేస్తోంది. ఇక ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోని రివార్డ్స్ సెక్షన్ నుంచి వినియోగదారులు ఈ ఆఫర్‌ను పొందొచ్చని కంపెనీ వెల్లడించింది. సాధారణంగా ఈ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌కు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా నెలకు 20 డాలర్లు (దాదాపు రూ.1730) ఛార్జీలను వసూలు చేస్తోంది.






